సబ్ కలెక్టర్ విడిది గృహాన్ని ప్రారంభించిన కలెక్టర్ మాధవీలత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు సబ్ కలెక్టర్ విడిది కార్యాలయాన్ని శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ప్రారంభించడం జరిగింది. స్ధానిక సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్మించిన నూతన గృహాన్ని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, సహయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి లతో కలిసి జిల్లా కలెక్టర్ మాధవీలత శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లడుతూ, ఇకపై ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా సబ్ కలెక్టర్ విడిది కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా పలువురు అధికారులు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ కు అభినందనలు తెలియజేశారు. తొలుత కలెక్టర్ కు వేదపండితులు వేద మంత్రాలతో తోడ్కొని రావడం జరిగింది. పూజాది కార్యక్రమాలను నిర్వహించినా అనంతరము వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డివిజనల్ అధికారి జి. పరశురామ్, ఎ ఈ హౌసింగ్ చక్రవర్తి, ఏ వో –  కే. రవి విక్రమ్, సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులు, సిబ్బంది, పలువురు అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *