ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం (ఈ ఎస్ ఎం ఎస్) యాప్ పై నోడల్ అధికారులందరూ అవగాహన కలిగి ఉండాలి…

నోడల్ అధికారులకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలి : జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర హెచ్ యం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నోడల్ అధికారులకు కేటాయించిన ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వర్తించి ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర హెచ్ యం సంబంధిత నోడల్ అధికారులను ఆదేశించారు. శనివారo స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు సార్వత్రిక ఎన్నికలు -2024 సన్నద్ధత పై నోడల్ అధికారులు మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు విధులు కేటాయించిన నోడల్ అధికారులు అందరూ సమన్వయం చేసుకుంటూ తమకు కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల నుండి అక్రమ మద్యం, ఓటర్లను ప్రభావితం చేసే పలు రకాల వస్తువులు అక్రమ రవాణా నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి లో భాగంగా ఎంసిసి నోడల్ అధికారి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమన్వయం చేసుకొని శాంతి భద్రతల పర్యవేక్షణ, సీజర్ ఆఫ్ క్యాష్, లిక్కర్, డ్రగ్స్, మద్యం మాదకద్రవ్యాలు అక్రమ నిల్వలు తదితరాలపై చెక్ పోస్టులు, స్టాటిక్ సర్వైవలెన్స్ టీంలు, సంబంధిత ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. ఎన్నికల పర్యవేక్షణ పటిష్టం చేయడానికి ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం (ఈఎస్ఎం ఎస్) యాప్ ప్రతి నోడల్ అధికారులందరూ డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల తనిఖీలో పట్టుబడిన నగదు, నగలు, బంగారం , మద్యం డ్రగ్స్ వగైరా వివరాలు డేటాను ఇందులో ఎప్పటికప్పుడు నమోదు చేసి సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ పెంచల్ కిశోర్,అడిషనల్ ఎస్పీలు రాజేంద్ర, వెంకట్రావు, అసిస్టెంట్ డిస్టిక్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రవి కిరణ్, ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ ఆసీస్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ సి బి ఐ సి ఏ జె ప్రసాద్ సంబంధిత నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *