విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చే విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఐటిఐలలో వివిధ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ ట్రేడ్ లలో ప్రవేశం కొరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి మరియు శిక్షణ సంస్థ డైరెక్టర్ డా. బి. నవ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హతగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కొరకు పోర్టల్ iti.ap.gov.in లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కొరకు ఆఖరు తేదీ జూన్ 10వ తేదీగా నిర్దారించామన్నారు. ఆన్ లైన్ దరఖాస్తు పూర్తి చేసే క్రమంలో ఎటువంటి తప్పులు లేకుండా సరిచూసుకుని ఆన్ లైన్ ద్వారా పంపించాలన్నారు. ఇతర వివరాల కొరకు దగ్గరలోని ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపాల్ ను సంప్రదించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి మరియు శిక్షణ సంస్థ డైరెక్టర్ డా. బి. నవ్య తెలిపారు.
Tags vijayawada
Check Also
గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషనలైజేషన్
-మూడు కేటగిరీలుగా సచివాలయాల విభజన -కనీసం 2500 మందికి ఒక గ్రామ, వార్డు సచివాలయం -మల్టీపర్పస్ ఫంక్షనరీస్, టెక్నికల్ ఫంక్షనరీలుగా …