రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం కేంద్ర కారాగారం రాజమహేంద్రవరం లో కారాగార పర్యవేక్షణాధికారి శ్రీరామ రాహుల్ గారి ఆధ్వర్యంలో “అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు” ఘనంగా జరిగాయి. ప్రతి రోజూ ఉదయము యోగాధ్యానం, యోగాసనాలతో రోజును ప్రారంభించే ఖైదీ సోదరుల మధ్యకు యోగ భారతి ట్రస్ట్ యోగా గురువులు అల్లు సత్యనారాయణ, శ్రీమతి నవీన లు వచ్చి ఖైదీ సోదరులతో యోగాసనములు మరియు యోగధ్యానం చేయించి, అష్టాంగయోగా యొక్క విశిష్టత ను మరియు ప్రాముఖ్యతను వివరించినారు. తెలిసో తెలియకో, పరిస్థితుల ప్రభావమో క్షణికావేశమో, కారణం ఏదైనా , జరిగిన నష్టమును బట్టి, కోల్పోయిన జీవితాన్ని బట్టి వ్యధ చెందే ఖైదీ సోదరులకు యోగా శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందనీ, సాధన ద్వారా మనిషి మహర్షిగా మారవచ్చని కారాగార పర్యవేక్షణాధికారి శ్రీరామ రాహుల్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యుటీ సూపరింటెండెంట్ యం. రాజ కుమార్, బి. రత్న రాజు, జైలర్లు కె.వి. రామారావు, ఆర్. శ్రీనివాసులు, కె. దుర్గా రమేష్ , సిహెచ్. రమేష్, డిప్యూటీ జైలర్లు, ఇతర సిబ్బంది మరియు ఖైదీలు పాల్గొన్నారు.
Tags rajamandri
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …