మేజర్ ఔట్ ఫాల్ డ్రైన్ పూడికలు తీయండి

-ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి
-ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ అధికారులకు ఆదేశాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ తన పర్యటనలో భాగంగా శనివారం ఉదయం బెంజ్ సర్కిల్ నేషనల్ హైవే, గురునానక్ కాలనీ రోడ్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, కొమరయ్య స్ట్రీట్, ఓల్డ్ రాజరాజేశ్వరి పేట, నిజాం గేట్ ప్రాంతాలు తిరిగి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు.

ముందుగా బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న వర్షపు నీటి నిలువలను చూసి ఎయిర్టెక్ మిషన్స్ తో వెంటనే నీటి విలువలను క్లియర్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తదుపరి గురునానక్ కాలనీ రోడ్డు పరిశీలించి అక్కడ రోడ్డుపై ఉన్న పెద్ద గుంటలు, వర్షపు నీటి నిల్వల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి వెంటనే వెట్ మిక్స్ తో గుంటలు పూడ్చేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. తదుపరి ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్డు లో తీవ్రంగా నిలిచి ఉన్న వర్షపునీటి నిలువలను గమనించి అక్కడున్న డ్రైనలలో పూడికలు తీపించడమే కాకుండా వర్షపు నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా వెళ్లేటట్టు ఏర్పాటు చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

తదుపరి సర్కిల్ 2 పరిధిలో ఉన్న కుమరయ్య వీధి లో మేజర్ ఔట్ ఫాల్ డ్రైన్ ను పరిశీలించారు. ఈ డ్రైన్ బ్లాక్ అవడం వల్ల ఏలూరు రోడ్ లో వర్షం నీటి నిలువలు నిల్వ ఉండటం గమనించి వెంటనే ఈ డ్రైన్ లో ఉన్న పూడికలను తీపిచ్చి వర్షపు నీటి ప్రవాహం సక్రమంగా జరిగేటట్టు చూశారు. తదుపరి 57వ డివిజన్ ఓల్డ్ రాజరాజేశ్వరి పేట ఔట్ ఫాల్ డ్రైన్ ని పరిశీలించి అందులో ఉన్న పూడికలను కూడా వెంటనే తీసివేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

నిరంతరం ఇంజనీరింగ్ సిబ్బంది పారిశుద్ధ సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు వర్షపు నీటి నిలువలను శుభ్రపరుస్తూ ఉండాలని, సానిటరీ సూపర్వైజర్లు, సానిటరీ ఇన్స్పెక్టర్లు పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలి అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చారు. తదుపరి సర్కిల్ వన్ పరిధిలో ఉన్న నైజాం గేట్ మేజర్ అవుట్ఫాల్ట్ డ్రైన్ ను పరిశీలించారు.

విజయవాడ నగర పరిధిలో కొండ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలని అప్రమత్తం చేస్తూ, వారిని వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు చేరేలా చూసుకోవాలని జోనల్ కమిషనర్లు మరియు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు అదిసలిచ్చారు. సెక్రటరీలందరూ, సానిటరీ సూపర్వైజర్లు, సానిటరీ ఇన్స్పెక్టర్ లందరూ అప్రమత్తంగా ఉంటూ ఫీల్డ్ లో విధులు నిర్వహించాలని విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటానని ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఎ మహేష్ హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *