విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాపుల సంక్షేమం, అభివృద్ధికి అమరావతి కాపునాడు కట్టుబడి ఉందని అమరావతి కాపునాడు రాష్ట్ర గౌరవాధ్యక్షులు సంకర సత్యనారాయణ అన్నారు. సోమవారం గాంధీ నగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో అమరావతి కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు
సుంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అమరావతి కాపునాడు రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా నరహరిశెట్టి సత్యనారాయణను నియమిస్తు నియామక పత్రాన్ని అందచేశారు అనంతరం సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా కాపు నాయకుడు వంగవీటి రంగా ఆశయాలకు అణుగుణంగా కాపుల సంక్షేమాభివృద్దికి కృషి చేస్తుమన్నారు. 2017లో కాపు ల అభివృద్ధి కి రిజిస్ట్రేషన్ చేశామని. 46 వేల మందికి ఉచితంగా కుల దృవీకరణకు పత్రాలకు మాఖర్చలతో సర్టిఫికెట్లు ఇచ్చి కాపు విద్యార్ధులకు అండగా నిలిచిమన్నారు. నరహరిశెట్టి సత్యనారాయణ గత నలభై సంవత్సరాలుగా పిళ్ళ వెంకటేశ్వరరావు, ముద్రగడతో, మాతో కలసి కాపుల అభివృద్ధి కోసం కృషి చేశారని తెలిపారు.వారి సేవలు ఇంకా కోనసాగాలని వారిని గౌరవ అధ్యక్షులుగా నియమించామని తెలిపారు.
అనంతరం నరహర శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ సిటి కాపు నాడు అధ్యక్షులుగా పని చేశామని రాజశేఖర్ రెడ్డి కాపు సంఘ విధ్యార్ధులకే కాక బడుగు బలహీన వర్గాలకు ,అండగా నిలుస్తామని, కాపు పేద విధ్యార్ధులకు పుస్తకాలు అంద చేస్తామని తెలిపారు. అనంతరం అమరావతి కాపు నాడు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నరహరిశెట్టి సత్యనారాయణను పూల దండలు వేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అమరావతి కాపునాడు రాష్ట్ర సెక్రటరీ జోన్నలగడ్డ రవీంద్ర నాథ్, జనరల్ సెక్రటరీ ఘంటా ఫణికుమార్, జనరల్ సెక్రటరీ వీర్ల జ్యోతిబసు, జనరల్ సెక్రటరీ చల్ల చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …