అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస విద్యుత్ ప్రమాదలపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాల ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిoచాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. చనిపోయిన వారికి రూ.5లక్షల పరిహారం ఇవ్వటం ముఖ్యం కాదని.. ప్రమాదాలు జరగకుండా చూసి ప్రజల ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని తెలిపారు. విధుల్లో విద్యుత్ సిబ్బంది అలసత్వాన్ని ఏమాత్రం ఉపేక్షించబోనని తెలిపారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలకు వెనకాడబోమని మంత్రి హెచ్చరించారు. ప్రాణం ఎంతో విలువైనదిగా భావిస్తూ సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. కనిగిరి విద్యుత్ షాక్ ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి తోనూ మాట్లాడారు. ఘటనలో యువకులు చనిపోవడం తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. మృతుల కుటుంబాలకి అన్ని విధాలా అండగా ఉంటామని పేర్కొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …