అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చడంపై జిల్లా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, కందుల నారాయణ రెడ్డి, బి.ఎన్ విజయ్ కుమార్, డా. ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ఎం. ఎం. కొండయ్య, ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మంత్రులు డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ…ఉమ్మడి ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం జిల్లా అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని అన్నారు.
Tags AMARAVARTHI
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …