-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు IAS.,
-నేడు (23.4.24) క్రీడా దినోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఘనంగా శిక్షా సప్తాహ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం అమలులోకి వచ్చి నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఈనెల 29 వరకు ‘శిక్షా సప్తాహ్’ కార్యక్రమం నిర్వహించుకుంటున్న సంగతి తెలిసిందే. రెండో రోజు కొనసాగిన ఈ కార్యక్రమంలో భాగంగా పునాది అభ్యసన మరియు సంఖ్యాశాస్త్రం నైపుణ్యాల అభివృద్ధి (ఫౌండేషనల్ లెర్నింగ్ & న్యుమరసీ డెవలెప్మెంట్) కార్యక్రమం విజయవంతంగా జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ‘నిపుణ్ భారత్’ ప్రతిజ్ఞ చేపట్టారు. రాష్ట్రంలో 38 వేల పాఠశాలలో శిక్ష సప్తాహ్ రెండో రోజు కార్యక్రమం తల్లిదండ్రుల భాగస్వామ్యంతో జరిగిందని తెలిపారు.
నేడు (24.7.24) క్రీడా దినోత్సవం
మూడో రోజు నేడు (బుధవారం) అన్ని పాఠశాలల్లో క్రీడా దినోత్సవం నిర్వహించాలని సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థులతో క్రీడలు, శారీరక సౌష్టవం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు క్రీడా పోటీలను నిర్వహించాలని ఉపాధ్యాయులను కోరారు.