Breaking News

తల్లిపాలే బిడ్డకు అమృతం మరియు ప్రథమటీకా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆగస్టు ఒకటో తేదీ నుండి ఏడో తేదీ వరకు అవగాహన కార్యక్రమ ప్రారంభ సందర్భంగా నేటి ఉదయం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు  జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ తల్లిపాల వారోత్సవాలకు సంబంధించిన గోడ ప్రతులను, బ్యానర్లను, కరపత్రములను ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో గౌరవ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ ,డాక్టర్ జి. గీతాబాయి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని ,డాక్టర్ శ్రావణ్ కుమార్ జిల్లా కోఆర్డినేటర్ ఫర్ ఆరోగ్య సర్వీసెస్ ,డాక్టర్ ఎన్. సుందరాచారి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పాల్గొన్నారు .ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారు మాట్లాడుతూ తల్లి ముర్రుబాలు బిడ్డకు మొదటి టీకా అని బిడ్డ జన్మించిన గంటలోపే తల్లిపాలు త్రాగించాలని క్షేత్రస్థాయి సిబ్బంది ప్రజలలో అవగాహన కల్పించవలసినదిగా ఆదేశించినారు .జన్మించిన మొదటి గంటలోపే కేవలం తల్లిపాలు బిడ్డకు జీవ రక్షక బిందువులని బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లి యొక్క పసుపు రంగులో ఉన్న చిక్కటి ముర్రుపాలు అమృతం లాంటివని వీటి ద్వారా బిడ్డకు అతి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయని , తల్లిపాలు శిశువును న్యూమోనియా మరియు అతిసార వ్యాధి వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి రక్షణతో పాటు పిల్లలలో మేధస్సును మెరుగుపరచటలో తోడ్పాటునందిస్తుంది. తల్లిపాలు అధిక రక్తపోటు, మధుమేహము మరియు స్థూలకాయం వచ్చే అవకాశాలను చాలా మేరకు తగ్గిస్తాయి. తల్లిపాలు ఇచ్చే వారిలో రొమ్ము, గర్భాశయం మరియు అండాశయ క్యాన్సర్ల ప్రమాదం తక్కువగా ఉంటుంది. తల్లిపాలు ఇవ్వడం వలన అదనపు బరువు తగ్గటానికి సహాయపడుతుంది. దీనితోపాటు తల్లిపాలు తల్లి మరియు బిడ్డ మధ్య బంధాన్ని పెంచుతుంది . నవజాత శిశువు యొక్క మొదటి ఆహారమైన తల్లిపాలతో బిడ్డకు రోగనిరోధక శక్తి మరియు సంపూర్ణ పోషణ లభిస్తుందని తెలియజేసినారు. తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం విజయవంతం చేయటానికి వైద్యారోగ్య శాఖతోపాటు అనుబంధ శాఖలైన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మొదలైనవి సహకరించవలసిందిగా తెలియజేసినారు. నవజాత శిశువు యొక్క మొదటి ఆహారమైన తల్లిపాలలో అనేక పోషక గుణాలు కలిగి ఉండుటవలన దానితో ఏ ఇతర డబ్బా పాలు గాని గేద పాలు గాని సరితూగమన్నారు. తల్లిపాలకు ఎటువంటి ప్రత్యామ్నాయం లేదని ప్రతి బిడ్డకు తల్లిపాలు అందేలా చేయడమే మన యొక్క లక్ష్యంగా పనిచేయవలసిందిగా తెలియజేసినారు .ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ ప్రభుత్వ సాధారణ వైద్యశాల డిప్యూటీ సూపర్డెంట్ డాక్టర్ శ్రీనివాస్, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ సతీష్, జిల్లా ఆరోగ్య విద్య విస్తరణాధికారి బి. శివ సాంబి రెడ్డి ,బి .రాజేంద్ర కుమార్ పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *