గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవానికి అల్పాహారం, భోజనంను నామమాత్రపు ధరకే అందించేందుకే సంకల్పించి పునఃప్రారంభం చేయనున్న అన్నా క్యాంటీన్లను గుంటూరు నగరంలో ఈ నెల 5 నాటికి పూర్తి స్థాయిలో సిద్దం చేయాలని నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం నగరపాలక సంస్థ పరిధిలోని అన్న క్యాంటీన్లలో జరుగుతున్నమరమత్తు పనులను కమిషనర్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించి, పనుల వివరాలు, టెండర్ పై ఎస్ఈని అడిగి తెలుసుకొని, పనులపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ప్రతిష్టాత్మకంగా పునఃప్రారంభం చేయనున్నదని, గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చుట్ట గుంట, మిర్చి యార్డ్, నల్లచెరువు, పల్నాడు బస్టాండ్, ఆర్.టి.ఓ. ఆఫీస్, ఐడి హాస్పిటల్, బస్టాండ్ ప్రాంతాల్లోని 7 అన్నా క్యాంటీన్లను ఈ నెల 5వ తేదీకి వినియోగంలోకి తీసుకురావడానికి ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రదానంగా పెయింటింగ్, విద్యుత్ వైరింగ్, ఫ్యాన్లు, స్విచ్ బోర్డ్ లు, లైట్లు, గ్లాస్ డోర్స్, ఫ్లోర్ మరమత్తులను చేపట్టాలన్నారు. హ్యాండ్ వాష్ పాయింట్స్, నీటి సౌకర్యం పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, సంప్ లు, ఓవర్ హెడ్ ట్యాంక్ ల వివరాలు అడిగి తెలుసుకొని, ప్రతి క్యాంటీన్ కు మోటార్ ఉండాలన్నారు. కాంపౌండ్ వాల్ కూడా ఉండేలా చూడాలని, క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రజారోగ్య అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. క్యాంటీన్ పరిసరాలలో పచ్చదనం పెంపుకు చర్యలు తీసుకోవాలని ఏడిహెచ్ ని ఆదేశించారు. టెండర్ పొందిన కాంట్రాక్టర్లు నిబందనలకు అనుగుణంగా, నాణ్యతా ప్రమాణాల్లో రాజీ లేకుండా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. క్యాంటీన్లు ఉన్న ప్రాంతాల ఏఈలు పనులను వేగంగా జరిగేలా భాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. పనుల పురోగతిపై డిఈఈలు, ఈఈలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
పర్యటనలో ఎస్.ఈ. ఎం.శ్యాం సుందర్, ఈఈలు సుందర్రామి రెడ్డి, కోటేశ్వరరావు, శ్రీనివాస్, ఏడిహెచ్ రామారావు, డిఈఈలు రమేష్ బాబు, శ్రీధర్, హనీఫ్, సతీష్, ఏఈలు రాంబాబు, సునీల్ కుమార్, నాగవేణి, సాంబశివరావు, సచివాలయ ఎమినిటి కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …