జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ పరిశీలన…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఘన వ్యర్ధాల నిర్వహణ పటిష్టంగా, ప్రణాళికాబద్దంగా చేపట్టినప్పుడే రోజువారి ఉత్పత్తి అవుతున్న వ్యర్ధాల సమస్యకు పరిష్కారం లభిస్తుందని నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ తెలిపారు. గురువారం నాయుడుపేటలోని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ని ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత జిందాల్ ప్రతినిదులతో ప్లాంట్ సామర్ధ్యం, అవసరమైన వ్యర్ధాలు, ఏ మున్సిపాల్టీల నుండి ఎంత చెత్త వస్తుంది, ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది తదితర వివరాలు అడిగి తెలుసుకొని, మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల్లో వ్యర్ధాల నిర్వహణ పెద్ద సమస్యగా ఉందని, ఉత్పత్తి అవుతున్న వ్యర్ధాలను ఒక చోట డంప్ చేయడం ద్వారా స్థలాభావ సమస్య కూడా ఎదురవుతుందన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ద్వారా వ్యర్ధాల నిర్వహణ తేలిక అవుతుందన్నారు. అలాగే జిందాల్ ప్లాంట్ కు ఇతర మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల నుండి వ్యర్ధాలు తరలిస్తున్నా, గుంటూరు నగరపాలక సంస్థ ప్రధానంగా ఉంటుందన్నారు. కనుక ప్రజారోగ్య సిబ్బంది గుంటూరు లక్ష్యానికి అనుగుణంగా ప్రతి రోజు 320 టన్నుల వ్యర్ధాలను జిందాల్ ప్లాంట్ కు తరలించాలన్నారు. కార్యక్రమంలో ఈఈ కొండారెడ్డి, డిఈఈ సతీష్, ఏఈ రవి కిరణ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ కుమార్, జిందాల్ ప్లాంట్ డిజిఎం ఎస్.సి.రాయుడు, సీనియర్ మేనేజర్ బి.శ్రీనివాసరావు, మేనేజర్ ఎస్.భార్గవ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *