-రివర్ ఫ్రంట్ పార్క్ ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురండి
-రామలింగేశ్వర నగర్ ఎస్ టి పి నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయండి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణలంక రిటర్నింగ్ వాల్ దగ్గర, వర్షం పడిన, వాడుక నీరైనా బయటకు వెళ్లే దారి లేక మురుగునీరుగా మారుతోందని అక్కడ నివసిస్తున్న ప్రజలు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర తన పరిశీలనలో ప్రజలను అడిగి తెలుసుకున్న సమస్యలలో ఒకటైన ఈ సమస్యకు శాశ్వత పరిష్కారముగా, డ్రైన్ నిర్మించుటకు అధికారులకు ఆదేశాలు ఇవ్వగా, ఆ డ్రైన్ నిర్మాణ పనులను శుక్రవారం ఉదయం తన పర్యటనలో మ్యాప్ ఆధారంగా పరిశీలించి, నిర్మాణ పనులను త్వరతీగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి ఏర్పాటు చేసిన కనకదుర్గ వారధి దగ్గర గల రివర్ ఫ్రెంట్ పార్కులో ఫెన్సింగ్ పనులను పూర్తి చేసి త్వరలో పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రివర్ ఫ్రంట్ పార్క్ ప్రారంభం నుండి చివరి వరకు నడుస్తూ పార్క్ లో అధికారులు తీసుకోవాల్సిన చర్యల పట్ల అధికారులకు సూచనలు చేశారు. తదుపరి రామలింగేశ్వర నగర్ ఎస్టిపి పరిశీలించి, వాటర్ ట్రీట్మెంట్ లో జరుగుతున్న ప్రాసెస్ ని పరిశీలించారు. అప్గ్రేడేషన్ లో పూర్తి కావాల్సిన పనులన్నీ త్వరగా పూర్తిచేసి, వాటర్ ట్రీట్మెంట్ ను మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచనలు ఇచ్చారు.
ఈ పర్యటనలు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తో పాటు అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్ కే వి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ ఎం ప్రభాకర్ రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వెంకటేశ్వర రెడ్డి, జి సామ్రాజ్యం, తదితరులు పాల్గొన్నారు.