సరైన కారణం లేకుండా చేసిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సస్పెన్షన్లు బేషరతుగా ఎత్తి వేయాలి

-ఎం.డి.జాని పాషా రాష్ట్ర అధ్యక్షుడు గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్
-ఒక్కరోజులోనే నూరు శాతం పింఛన్ పంపిణీ చేయడమే లక్ష్యంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఒక్కరోజులోనే 97 శాతం పూర్తి చేసి మరోసారి సమర్ధత నిరూపించుకున్నారు
-గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అత్యంత సమర్ధవంతంగా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడం కోసం గత ఐదు సంవత్సరాలనుండి ఆదర్శవంతంగా పనిచేస్తున్నారు:ఎం.డి.జాని పాషా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
యన్.టి.ఆర్ భరోసా సామాజిక పింఛన్ పంపిణీలో భాగంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు స్ఫూర్తిదాయకంగా పనిచేశారు.అందువలన ఒక్కరోజులోనే 97శాతం మంది లబ్ధిదారులకు పింఛన్ అందించాం.సాంకేతిక సమస్యల వలన మరియు ఉద్యోగుల స్మార్ట్ ఫోన్లలో ఏర్పడిన సాంకేతిక సమస్యలు మరియు స్మార్ట్ ఫోన్లు వివిధ కారణాల వలన ఫోన్లు పనిచేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 0.25 శాతం మంది సచివాలయ ఉద్యోగులు కొంత ఆలస్యంగా పెన్షన్ పంపిణీ ప్రారంభించినప్పటికీ సాయంత్రంలోగా వారికి కేటాయించిన లబ్ధిదారులకు 97 శాతం నుండి 100శాతం పూర్తి చేశారు. అయినప్పటికీ,కొన్ని జిల్లాలలో అధికారులు సచివాలయ ఉద్యోగులను సస్పెండ్ చేయడం వారికి షోకాజ్ నోటీసులు జారీచేయడం బాధాకరం.

ప్రభుత్వ లక్ష్యం సాధించడం కోసం సచివాలయ ఉద్యోగులు ఒక యజ్ఞంలా పింఛన్ పంపిణీ చేసి రికార్డు నెలకొల్పిన సందర్భంలో కొన్ని ప్రాంతాల్లో సస్పెన్షన్లు, షోకాజ్ నోటీసులు జారీచేయడం వలన ఉద్యోగుల ఆందోళన చెందుతున్నారు.కనుక,అధికారులు సహృదయంతో ఉద్యోగుల సస్పెన్షన్లు ఎత్తివేయాలని కోరుతున్నాం. గ్రామ వార్డు సచివాలయాల శాఖ తరపున ఉద్యోగుల సస్పెన్షన్లు ఎత్తివేయడం కోసం తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నామని, సదరు సస్పెన్షన్లు మరియు షోకాజ్ ల విషయం అధికారుల ద్రుష్టికి సైతం తీసుకొని వెళ్లినట్లు తెలిపుతూ, ఈ సందర్భంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.జాని పాషా సచివాలయాల శాఖను కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *