-ప్రభుత్వం ఉద్యోగులపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుందాం.
-ఎన్జీవో నేత ఏ. విద్యాసాగర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగుల సమస్యలను అర్ధం చేసుకొని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గత ఐదు సంవత్సరాలలో లేనివిధంగా ఆగస్టు నెల ఒకటో తేదీనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు జీతాలు,పెన్షనర్లకు పెన్షన్లు చెల్లించటం హర్షణీయమని ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు ఏ. విద్యాసాగర్ అన్నారు. గాంధీనగర్ లోని ఏపీ ఎన్జీవో హోమ్ నందు శుక్రవారం ఉద్యోగ సంఘ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఎన్జీవో అస్సోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఏ. విద్యాసాగర్ మాట్లాడుతూ ఏపీ ఎన్జీవో రాష్ట్ర సంఘ నాయకులు గత నెలలో ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, వర్క్ చార్జడ్, అంగన్వాడి, ఆశ ఉద్యోగులకు కూడా ఒకటో తేదీనే జీతాలు చెల్లించిన ప్రభుత్వానికి ఉద్యోగులు, పెన్షనర్ల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నామన్నారు. గతంలో జీతాలు ఎప్పుడొస్తాయో అని ఎదురుచూసి ఒకరికొకరు జీతాలు పడ్డాయా అని అడిగే ఫోన్ మెస్సేజ్ లు వచ్చేవని ఆర్ధిక పరిస్థితులతో సతమతమయ్యే ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఖాతాలలో జమ అయ్యాయనే బ్యాంకు నుండి వచ్చిన ఫోన్ మెసేజ్ లు చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఐదు ఏళ్లుగా గత ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చూపిన వివక్షత, నిర్లక్ష్య ధోరణితో విసిగివేసారిన ఉద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగుల సంక్షేమం గౌరవం పట్ల శ్రద్ద చూపుతున్నరన్నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని జీతాల చెల్లింపులతో పాటు కొత్త డీఏ సొమ్మును కూడా జత చేసి ఇవ్వడం జరిగిందన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోరే ప్రభుత్వానికి ఉద్యోగులందరూ అంకితభావంతో సేవలందించి ముఖ్యమంత్రి ఆలోచనావిధానాలకు అనుగుణంగా రాష్ట్రాభివృద్ధిలో పూర్తీ భాగస్వాములు అయ్యేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలన్నారు. పేద, బలహీన వర్గాలకు, వృద్దులు, వితంతువులు, విభిన్న ప్రతిభావంతులకు ఒకటో తేదీనే 97 శాతం పెన్షన్లు చెల్లించడం సంతోషదాయకమన్నారు. ఒకటవ తారీఖు సామాజిక పెన్షన్లు 6 గంటలకల్లా వివిధ కారణాలవల్ల మొదలుపెట్టని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇచ్చిన షోకాజ్ నోటీసుల్ని ఉపసంహరించి వారి మీద చర్యలు తీసుకోకూడదని, భవిషత్తులో అటువంటివి పునరావృత్తం కాకుండా ఉద్యోగులు జాగ్రత్త పడతారని తెలిపారు. సాంకేతిక సమస్యలకు ఉద్యోగులను బాధ్యులను చేయొద్దని విద్యాసాగర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో జిల్లా సెక్రటరీ డి. సత్యనారాయణ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.సతీష్ కుమార్ ఉపాధ్యక్షులు డి.విశ్వనాథ్ నగర అధ్యక్షులు సివిఆర్ ప్రసాద్ కార్యవర్గ సభ్యులు నజీరుదీన్ మధుసూదనరావు వి వి ప్రసాద్ కె.శివశంకర్ వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.