గృహ నిర్మాణ శాఖ 100 రోజుల లక్ష్యాల నిర్దేశం మేరకు ప్రణాళికా బద్ధంగా పురోగతి సాధించాలి

-రోజువారీ స్టేజి కన్వర్షన్ పురోగతిపై సమీక్షించుకుని సకాలంలో లక్ష్యాలను సాధించాలి…
-అలసత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం పేదవారికి ఇళ్లు కల్పించే సమున్నత సంకల్పంతో ఉన్నదని, ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ 100 రోజుల లక్ష్యాల నిర్దేశించుకుని ప్రణాళికా బద్ధంగా రోజువారీ స్టేజి కన్వర్షన్ పురోగతిపై సమీక్షించుకుని సకాలంలో లక్ష్యాలను సాధించాలని, అలసత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు గృహ నిర్మాణ శాఖ పై జిల్లా కలెక్టర్ గారు జెసి శుభం బన్సల్ తో కలిసి సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణ శాఖ వంద రోజులకు లక్ష్యాలు నిర్దేశించుకున్న మేరకు రోజువారీగా 36618 స్టేజి కన్వర్షన్ల పురోగతి సాధించేలా పనితీరు ఉండాలని సూచించారు. ఇక నుండి ప్రతి వారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షిస్థానని సూచించారు. ప్రారంభం కానివి, పునాది నుండి గోడల స్థాయికి, గోడల స్థాయికి వచ్చిన వాటిని పై కప్పు స్థాయికి ఇలా 28931 ఇల్లు, పూర్తి స్థాయి రూఫ్ క్యాస్ట్ స్థాయికి 7687 స్టేజి కన్వర్షన్ పురోగతి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పునాది స్థాయి నుండి గోడల స్థాయి ఆ పైన రోజు వారీగా ఏఈ ల వారీగా పురోగతి ఉండేలా చూడాలని సూచించారు. వచ్చే శుక్రవారం నాటికి పురోగతి వైపు చర్యలు ఉండాలని తెలిపారు. ఈఈ లు, డిఈ, ఎఈ, వర్క్ ఇన్స్పెక్టర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు క్షేత్ర స్థాయిలో పర్యటించి వారికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి సమన్వయంతో పని చేయాలని సూచించారు. లక్ష్యాల సాధనలో గృహ నిర్మాణ శాఖ అధికారులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. రానున్న నెలల్లో మరింత వర్షాలు ఉండే అవకాశమున్న నేపథ్యంలో ఇప్పటి నుండే అధికారులు స్టేజి కన్వర్షన్ పై దృష్టి పెట్టి పురోగతి చూపాలని, అలసత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని అన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు వెంకటేశ్వర్ రావు, ఈఈ లు మోహన్ రావు, శేషగిరి, డిఈ లు శ్రీనివాస రావు, జహీర్, దాశయ్య, సత్యనారాయణ, షబ్బీర్, ఎఈ లు తదితర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *