-ఆగస్టు 2 నుంచి 8వ తేదీ వరకు శిక్షణ తరగతులు
-హాజరైన రెవిన్యూ జూనియర్ అసిస్టెంట్స్, గ్రేడ్-1 గ్రామ రెవిన్యూ అధికారులు
-సిపివో ఎల్. అప్పలకొండ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని రెవిన్యూ శాఖలో గల జూనియర్ అసిస్టెంట్స్, గ్రేడ్-1 గ్రామ రెవిన్యూ అధికారులకు పంట కోత అంచనా సర్వే మరియు వ్యవసాయ గణన అతయ పరీక్ష లకోసం ముందస్తు అవగాహన అంశములపై ఆగస్టు 2 నుంచి 8వ తేదీ వరకు శిక్షణ నిర్వహిస్తున్నామని జిల్లా అర్థ గణాంక అధికారి (సి.పి.ఓ) ఎల్. అప్పలకొండ తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా రెవిన్యూ శాఖలోని జూనియర్ అసిస్టెంట్స్, గ్రేడ్-1 గ్రామ రెవిన్యూ అధికారుల శిక్షణ కార్యక్రమం కు తొలిరోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎల్. అప్పలకొండ మాట్లాడుతూ ఆగస్టు 2 నుంచి 8వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సర్వే విషయాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. శిక్షణా కార్యక్రమాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలని తెలియ చేశారు. అదే విధంగా సర్వే విషయాలపై అవగాహన కల్పించడం, భవిష్యత్తు లో పదోన్నతుల్లో భాగంగా సర్వే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇందులో భాగంగా తొలి రోజు శిక్ష5 కార్యక్రమంలో జిల్లా , డివిజన్, మండల స్థాయి స్టాటిస్టికల్ అధికారులు, గ్రేడ్-1 గ్రామ రెవిన్యూ అధికారులు, రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్ లు, పాల్గొనడం జరిగిందన్నారు.