-ఇంఛార్జి జెసి నరసింహులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం వారు వినియోగదారులకు తక్కువ ధరకు బియ్యం మరియు కందిపప్పు అందించాలనే ఉద్దేశ్యంతో రైతు బజార్లు, స్పెషల్ కౌంటర్లు యందు మరోసారి కందిపప్పు మరియు బియ్యం ధరలు తగ్గించి యున్నారు. “సరసమైన ధరలలో నాణ్యమైన సరుకుల అమ్మకం” అను బ్యానర్ అన్ని రైతుబజార్లు మరియు స్పెషల్ కౌంటర్లు యందు ప్రదర్శించవలసిందిగా ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో మిల్లర్లతో ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జిల్లాలో 104 ప్రత్యేక కౌంటర్లు ప్రారంభించి, సదరు కౌంటర్లు ద్వారా అమ్మకములు జరుగుచున్నవి. ఆ మేరకు తగ్గించున్స్ ధరల వివరాలు తెలియ చేస్తూ కిలో ధర కందిపప్పు (దేశవాళి).బహిరంగ మార్కెట్ రూ.165/- తగ్గించిన ధర రూ.150/- , బియ్యం (స్టీమ్) బహిరంగ మార్కెట్ లో రూ.55/-, తగ్గించిన ధర రూ.47/- లకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
మండలముల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల వివరాలు రాజమహేంద్రవరం అర్బన్ – 47 , రాజమహేంద్రవరం రూరల్ – 21 , గోకవరం – 3 , కోరుకొండ – 4 , సీతానగరం -1 , రాజానగరం – 1 , రంగంపేట – 1 , అనపర్తి – 5 , కొవ్వూరు – 2 , చాగల్లు – 1 , నిడదవోలు – 12 , తాళ్ళపూడి – 2 , దేవరపల్లి – 1 , నల్లజర్ల – 2 , ఉండ్రాజవరం – 3
, పెరవలి – 1
పైన తెలిపిన మండలములలో రైతుబజార్లు మరియు షాపుల యందు కందిపప్పు మరియు బియ్యం తగ్గించిన ధర లకు అమ్మకమునకు అందుబాటులో ఉంచడం జరిగిందని ఆయన తెలిపారు. కావున వినియోగదారులకు ప్రచారం మరియు అవగాహన కల్పించవలసిందిగా తెలియచేయడమైనది.
జిల్లాలో పౌర సరఫరాల శాఖ మరియు లీగల్ మెట్రాలాజి వారు సంయుక్తంగా రైస్ షాపుల పై దాడులు నిర్వహించి, బ్రాండ్ వారీగా ధరల పట్టిక లేనందున, MRP ముద్రించనందున మరియు బియ్యం బస్తాలలో తూకం తక్కువగా ఉండడం వలన రాజమహేంద్రవరం అర్బన్ మండలం నందు 5 రైస్ షాపులపై కేసులు నమోదు చేయడమైనదని తెలిపారు ..కావున జిల్లాలోని రైస్ మిల్లులు రైస్ షాపులు, ఆయిల్ షాపులు, రైతుబజార్లు, బిగ్ చైన్ రిటైలర్స్ మరియు కిరాణా వర్తకులందరూ బ్రాండ్ వారీగా ధరల పట్టిక ప్రదర్శించవలెనని, బస్తాలపై MRP రేటు ఉండే విధంగా సరి చుసుకొనవలేనని, కొనుగోలు చేసుకున్న సరుకుకు బిల్లు తీసుకొన వలెనని, వినియోగదారులకు తప్పనిసరిగా బిల్లు లు జారీ చేయవలసిందిగా కోరి యున్నారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాధికారి పి విజయ భాస్కర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ టి రాధిక మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.