ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందేందుకు గిరిజన యువతి యువకులకు ఐ టి డీ ఏ రంపచోడవరం లో శిక్షణ

-ఆగస్ట్ 3 నుంచి ఆగష్టు,9 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం
-జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జ్యోతి

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
బిఇడి/డిఇడి మరియు టెట్ పాసైన  తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గిరిజన యువతి యువకులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందేందుకు ఐ టి డీ ఏ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె యన్ జ్యోతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం ఐటీడీఏ ఏడు మండలాల్లోని, కాకినాడ జిల్లా, డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,తూర్పుగోదావరి జిల్లా లలో) గిరిజన యువతి యువకులు బిఇడి/డిఇడి మరియు టెట్ పాసైన గిరిజన యువతి యువకులకు ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం వారు పేర్కొనడం జరిగిందనీ తెలిపారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఏజెన్సీలోని గిరిజన యువతి యువకులు డిగ్రీతో పాటు బీఈడీ / ఇంటర్ తో పాటు డిఇడి టెట్ పాసైన అభ్యర్థులకు రంపచోడవరం యూత్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఏదైనా స్క్రీనింగ్ టెస్ట్ పాసైన వారు కూడా డీఎస్సీ కోచింగ్ కొరకు దరఖాస్తులు సమర్పించుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని అన్నారు. మహిళలకు 33.1/3 శాతం రిజర్వేషన్ సదుపాయం కలదని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 3 వ తారీఖు నుండి ఆగస్టు 8 వ తారీఖు వరకు దరఖాస్తులు పంపవచ్చునని తెలిపారు. స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఫైనల్ మెరిట్ లిస్టు ఆగస్టు 14వ తేదీన ఐటీడీఏ కార్యాలయాపు నోటీస్ బోర్డ్ లో పొందుపరచబడునని ఆయన తెలిపారు. ఫైనల్ లిస్ట్ ప్రకారం ఆగస్టు మూడో వారం నుండి సుమారు 90 రోజులపాటు 150 మంది గిరిజన అభ్యర్థులకు మాత్రమే భోజనము వసతి సౌకర్యంతో ఉచిత శిక్షణ యూత్ ట్రైనింగ్ సెంటర్ రంపచోడవరంలో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు..అనుభవజులైన గిరిజన సంక్షేమ శాఖ సీనియర్ ఉపాధ్యాయులతో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ శిక్షణకు అర్హత కలిగిన యువతి యువకులు ఐటీడీఏ మెయిల్ ఐడి dsccoachingitdarcvm@gmail.com ద్వారా దరఖాస్తులు సమర్పించుకోవచ్చనని తెలిపారు. అదేవిధంగా రంపచోడవరం యూత్ ట్రైనింగ్ సెంటర్లో నేరుగా యూత్ ట్రైనింగ్ సెంటర్ మేనేజర్ వారికి దరఖాస్తులు సమర్పించుకోవచ్చునని కట్టా సింహాచలం తెలిపారు. మరిన్నీ వివరాలకు రంపచోడవరం యూత్ ట్రైనింగ్ సెంటర్ మేనేజర్ 7569098197 సెల్ నెంబర్ కు నేరుగా సంప్రదించగలరని తెలియజేసి యున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *