గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఔట్ ఫాల్ డ్రైన్లలో మురుగునీరు నిల్వకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా సిల్ట్ ఉంటే సదరు కాంట్రక్టరే తీసేలా ఇంజినీరింగ్ అధికారులు సమన్వయం చేసుకోవాలని నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి లక్ష్మీపురం, జిటి రోడ్, సంపత నగర్, నల్లచెరువు ప్రాంతాల్లో నగరానికి ప్రధాన ఔట్ ఫాల్ డ్రైన్ అయిన పీకలవాగుని పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రధాన ఔట్ ఫాల్ డ్రైన్లలో మురుగునీరు, వ్యర్ధాలు నిల్వ ఉండకుండా ఉంటే వర్షం నీరు కూడా ఆగకుండా వెళ్తుందన్నారు. కనుక ఔట్ ఫాల్ డ్రైన్ శుభ్రంగా ఉండేలా ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా పూడిక ఉంటే, పూడికతీత పనులు చేపట్టిన కాంట్రాక్టరే తొలగించేలా ఇంజినీరింగ్ అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. తొలగించిన పూడికను వెంటనే తరలించాలని, లేకుంటే వర్షాలకు డ్రైన్ లో పడుతుందన్నారు. ఔట్ ఫాల్ డ్రైన్లలోకి వచ్చే మైనర్ డ్రైన్లకు ఇనుప జాలీలు ఏర్పాటు చేస్తే చెత్త, ప్లాస్టిక్ వ్యర్ధాలు రాకుండా అడ్డుకోవచ్చన్నారు. అంతర్గత ప్రాంతాల్లో పారిశుధ్య పనులు సమగ్రంగా చేపట్టడంపై ప్రజారోగ్య అధికారులు శ్రద్ధ చూపాలని, ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం జరిగాలని ఎంహెచ్ఓని ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు రోడ్ల పక్కన ఉంటున్నాయని, విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ లైన్ వెంబడి తొలగించే సమయంలో తప్పనిసరిగా వారే సదరు కొమ్మలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఎస్.ఈ.ని ఆదేశించారు.
పర్యటనలో ఎస్.ఈ. ఎం.శ్యాం సుందర్, ఎంహెచ్ఓ మధుసూదన్, ఈఈ సుందర్రామి రెడ్డి, డిఈఈ రమేష్ బాబు, ఏఈలు రాంబాబు, శ్రీకాంత్, సచివాలయ ఎమినిటి కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …