మున్సిపాలిటీలలో ఆస్తి పన్ను వసూళ్లు, శానిటేషన్ మెరుగుపరచాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మున్సిపాలిటీలలో ఆస్తి పన్ను వసూళ్లు, శానిటేషన్ మెరుగుపరచాలని, పట్టణాభివృద్ధి పథకాల కింద చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో మినీ కాన్ఫరెన్స్ హాలులో పంచాయతీరాజ్, పురపాలక పట్టణాభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు అన్ని మున్సిపాలిటీలలో ఆస్తి పన్ను వసూళ్లు మున్సిపాలిటీల వారీగా సమీక్షించారు. పట్టణాభివృద్ధికి సంబంధించి కేంద్ర రాష్ట్ర పథకాల కింద, అమృత్ స్కీం క్రింద చేపట్టిన పనుల పురోగతి సమీక్షించారు. ముఖ్యంగా వర్షాకాలం సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా డ్రైనేజీలలో సిల్ట్ తీయించడం, శానిటేషన్ డ్రైవ్ చేపట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాలో గ్రామ వార్డు సచివాలయాల పనితీరు సమీక్షించిన కలెక్టర్ సచివాలయాల్లో వివిధ అంశాల్లో ఫంక్షనరీస్ యొక్క విధులు, సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న ఆధార్ తదితర సేవలు గురించి ఆరా తీశారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో ఆనంద కుమార్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *