మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భారత జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర సమరయోధుడు కీ.శే. పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం కలెక్టరేట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పింగళి వెంకయ్య మన జిల్లా వాసి కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా, జాతీయ జెండా రూపశిల్పిగా పింగళి వెంకయ్య జీవితం నేటి తరానికి ఆదర్శం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో ఇన్చార్జి శ్రీదేవి, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …