విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విజయోత్సవ సంబరాల కార్యక్రమంలో భాగంగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై మాదిగ జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గాంధీనగర్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నేత కాండ్రు సుధాకర్ మాట్లాడుతూ జయహో ఎస్సీ రిజర్వేషన్స్ వర్గీకరణ అని అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ మూడు దశబ్దాలుగా పోరాటం సాగిందన్నారు. ఎస్సీలో ఒక సామాజికవర్గమే ఫలాలు పొందుతుందని దీంతో మిగతా మాదిగ, మాదిగ ఉప కులాలు అన్యాయానికి గురవుతున్నారన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణకు మార్గం సుగమమైందన్నారు. నేత మందా కృష్ణ మాదిగతో మాదిగలందరూ కలిసి 30 ఏళ్ల పోరాట ఫలితం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విజయం సాధించామన్నారు. సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలని, రాజ్యాంగ రిజర్వేషన్ ఫలాలు అందరికీ సమానంగా అందించాలని మాజీ డిప్యూటీ మేయర్ సిరిపురపు గ్రిటన్ కోరారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో అమరులైన వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చింతా శాంతకుమార్, అప్పికట్ల జీవరత్నం, కాంపాటి రాజ్‌కుమార్, బూతపాటి ఫిలోమాన్, మందా వెంకటేశ్వరరావు మాదిగ, నూకపోగు యేసు, మంద వెంకటేశ్వరరావు, పేరెల్లి ఎలీషా, లింగాల నర్సింహులు ఎమ్మార్పీఎస్ జేఏసీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …