Breaking News

సకాలంలో నిత్యావసర సరుకులు అందించేలా అన్ని చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎండియు ఆపరేటర్లు కార్డుదారులకు సకాలంలో నిత్యావసర సరుకులు అందించేలా అన్ని చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా ఆదేశించారు .జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులతో కలసి జాయింట్ కలెక్టర్ నిధి మీనా శనివారం స్థానిక సింగ్ నగర్ వద్ద మొబైల్ డిస్పెర్సింగ్ వెహికల్ (ఎండియు) ద్వారా కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు . ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డుదారులకు నాణ్యమైన నిత్యావసర వస్తువులతో పాటు ఎటువంటి లోటుపాట్లు లేకుండా పటిష్టంగా ఈ వ్యవస్థను నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రతీ నెల 17వ తేదీ లోగా ఎండియూ ఆపరేటర్లు వారి పరిధిలో రేషన్ పంపిణీ చేయడం పూర్తికావాలన్నారు . జిల్లాలో 374 ఎండియూ వాహనాల ద్వారా రేషన్ కార్డుదారులకు నిర్దేశించిన గడువులోగా అందచేయాలన్నారు . ఇప్పటికే ఎండియు వాహనాలకు ఆయా కార్డుదారులతో మాప్పింగ్ నిర్వహించటం జరిగిందన్నారు. పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్లు పంపిణీని పర్యవేక్షించాలన్నారు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం పంపిణీ పూర్తికావాలని జాయింట్ కలెక్టర్ నిధి మీన స్పష్టం చేసారు.

రైతు బజార్లో బియ్యం కందిపప్పు అమ్మకాల ప్రత్యేక కౌంటర్ ను పరిశీలించిన జెసి నిధి మీనా
రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ ఆదేశాల‌తో జిల్లాలో రైతుబ‌జార్లు, పెద్ద సంస్థాగ‌త రిటైల్ దుకాణాల్లో స‌ర‌స‌మైన ధ‌ర‌ల్లో నాణ్య‌మైన నిత్యావ‌స‌ర స‌రుకులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఉషోద‌య‌, మెట్రో, రిల‌య‌న్స్‌, డీమార్ట్ త‌దిత‌ర పెద్ద రిటైల్ దుకాణాల్లో ప్ర‌త్యేక కౌంట‌ర్ల ద్వారా స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కు నాణ్య‌మైన స‌రుకులు పొందవచ్చు నన్నారు. ప్ర‌స్తుతం మార్కెట్లో కిలో కందిప‌ప్పు (దేశ‌వాళి) ధ‌ర రూ. 181 ఉండ‌గా, ప్ర‌త్యేక కౌంట‌ర్ల‌లో రూ. 150కే అందుబాటులో ఉంచామని, కిలో బియ్యం (స్టీమ్డ్‌-బీపీటీ/సోనామ‌సూరి) ధ‌ర మార్కెట్లో రూ. 55.85 ఉండ‌గా ప్ర‌త్యేక కౌంట‌ర్ల‌లో రూ. 48కే అందుబాటులో ఉన్న‌ట్లు తెలిపారు. కిలో బియ్యం (ప‌చ్చి-బీపీటీ/సోనా మ‌సూరి) రూ. 52.40 ఉండ‌గా.. ప్ర‌త్యేక కౌంట‌ర్ల‌లో రూ. 47కే ల‌భిస్తుంద‌ని అన్నారు. ప్ర‌జ‌లు ఈ కౌంట‌ర్ల‌ను స‌ద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని జాయింట్ క‌లెక్ట‌ర్ నిధి మీనా సూచించారు. పరిశీలనలో జేసీతో పాటు డీఎస్ఓ యం. మోహన్ బాబు, రైతు బజార్ ఎస్టేట్ అధికారి కోటేశ్వరరావు ఉన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *