Breaking News

నగరంలో ఘనంగా కాకాని వెంకటరత్నం 124వ జయంతి కార్యక్రమం


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
నగరంలో స్వాతంత్య్ర సమరయోధులు, రాష్ట్ర మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం 124వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. శనివారం, బెంజిసర్కిల్‌ సమీపంలోని స్వాతంత్య్ర సమరయోధులు, రాష్ట్ర మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం 124వ జయంతి కార్యక్రమాన్ని బెంజిసర్కిల్లోని కాకాని వెంకటరత్నం విగ్రహం వద్ద ఆయన మనవడు తరుణ్‌ కాకాని ఆధ్వర్యంలో విగ్రహనికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆడ్డూరి శ్రీరామ్‌ మాట్లాడుతూ దేశం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు పాటుపడిన కాకాని వెంకటరత్నంను ఆదర్శంగా తీసుకుని అందరూ ముందుకు సాగాలన్నారు. కాకాని వెంకటరత్నం మనవడు, అమరావతి బోటింగ్‌ క్లబ్‌ సీఈఓ డాక్టర్‌ తరుణ్‌ కాకాని మాట్లాడుతూ ఆగస్టు 3వ తేదీన మా తాతగారు కాకాని వెంకటరత్నం జయంతి రోజునే నా పుట్టిన రోజు రావడం యాధృశ్చికమన్నారు. ఆయన వారసుడుగా ఆయన చూపిన బాటలోనే నేను ప్రయాణం చేస్తున్నానన్నారు. బీజేపీ అజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ 75 సంవత్సరాల స్వాతంత్య్రం సందర్భంగా కాకాని వెంకటరత్నం స్వాతంత్య్ర నాయకుడుగా గుర్తించి ఆయన కార్యక్రమాన్ని నిర్వహించేలా పూనుకోవడం పట్ల బీజేపీ పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి నివాళులు అర్పించిన ప్రముఖులు, నాయకులు, అధినాయకులు, అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ అన్నదానం చేయడం, ఠాగూర్‌ స్మారక గ్రంధాలయంలో అవసరాల నిమిత్తం ఏసీని బహుకరణ, నిరుపేద కుటుంబం జీవనోపాది నిమిత్తం రూ.30వేలు విలువ చేసే స్టీల్‌ కౌంటర్‌, పండ్లు పంపిణీ, బండి పంపిణీ కార్యక్రమం, తదితర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజధానిలో కూడా ఆయన పేరుమీద ఇచ్చిన హామీ మేరకు పార్క్‌ ఏర్పాటుచేయాలని కోరడం జరుగుతుందన్నారు. ఆయన పాటు ప్రయాణించిన సీనియర్‌ నేతలకు కూడా ఎప్పుడూ అందుబాటులో వుంటూ సహకారాలు అందజేస్తానన్నారు. అనంతరం కాకాని వెంకటరత్నం జయంతి కార్యక్రమంతోపాటు డాక్టర్‌ తరుణ్‌ కాకాని అభిమానులు ఆయన పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి కేక్‌ కట్‌ స్వీట్స్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సెక్రటరీ భోగవల్లి శ్రీధర్‌, కొలపల్లి గణేష్‌, గోవింద్‌, శ్రీనివాసరావు, కిలారు దిలీప్‌, వెంకట్‌, మోతుకూరి వెంకటేశ్వరరావు, అనిల్‌ లింగమనేని, జిల్లా కన్స్యూమర్‌ కోర్టు జడ్జిలు నెలపూడి చిరంజీవి, అక్కిపెద్ది వెంకటరమణ, బీజేవైఎం నాయకులు నవీన్‌, గ్రంథాలయాదికారిణి కె.రమాదేవి, పాఠకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *