తల్లి పాల ప్రాధన్యత ను ప్రతి ఒక్కరు గుర్తించాలి…

-లక్ష్మి శ్యా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రష్టు సిఈవో

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
తల్లిపాలు శిశువునకు తొలి ఆరోగ్య టీకాలా పనిచేస్తుందని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రష్టు సిఈవో లక్ష్మి శ్యా పేర్కొన్నారు. ఆదివారం అఖిల భారత పిల్లల వైద్య నిపుణుల మండలి కృష్ణా జిల్లా వైద్య మండలి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తల్లిపాల వారోత్సవాల అవగాహన నడకను అయన లంచనంగా ప్రారంభించారు. తల్లిపాల అవగాహననడకలో వివిధ వైద్య సంస్థల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నడక IMA హాలు నుంచి ప్రభుత్వ ఆస్పత్రి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తల్లి పాలు మాత్రమే చంటిబిడ్డకు అమృతంలా అవసరం అవసరం అవుతాయన్నారు. అంతరాన్ని తగ్గిద్దాం, తల్లులందరు తల్లిపాలు ఇచ్చేలా మద్దతిద్దాం అనే నినాదంతో జరుగుతున్న తల్లిపాల వారోత్సవాలను అందరూ విజయవంతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య విషయంలో ప్రాధాన్యత అధికంగా ఇస్తోందన్నారు. ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రష్టు ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ రుగ్మాత నివారణ చికిత్సకు సాయం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలభరత పిల్లల వైద్యానిపుణుల మండలి కృష్ణా విభాగ అధ్యక్షురాలు డాక్టర్ యలమంచిలి సంధ్యా, కార్యదర్శి డాక్టర్ వి శ్రీదేవి, IMA విజయవాడ ప్రెసిడెంట్ డాక్టర్ చలసాని ప్రమోద్, డాక్టర్ వెల్లంకి శ్రీదేవి, డాక్టర్ సంఘమిత్ర,డాక్టర్ పీవీ దుర్గరాణి, డాక్టర్, డాక్టర్ చందన తదితరులు ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *