విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాన్ కంట్రోల్ రూమ్ లో సోమవారం ఉదయం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 36 ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గారి ఆదేశాల మేరకు అడిషనల్ కమిషనర్ (జనరల్)డాక్టర్ ఏ మహేష్, ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి సంబంధిత అధికారులకు ఆ సమస్య గురించి క్షుణ్ణంగా తెలుసుకొని ఆ సమస్య త్వరగా పరిష్కారం అయ్యేటట్టు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందుకున్న ప్రతి ఫిర్యాదును మూడు సర్కిల్లో ఉన్న జోనల్ కమిషనర్లు తమ తమ పరిధిలో నుండి వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందుకున్న 36 ఫిర్యాదుల్లో, అత్యధికంగా పట్టిన ప్రణాళిక విభాగానికి సంబంధించి 15 రాగా, ఇంజనీరింగ్ 8, ఎస్టాబ్లిష్మెంట్ 3, రెవెన్యూ,జెడి అమృత్, విఏ యస్, ప్రజారోగ్యం 2, యు సి డి మరియు హార్టికల్చర్ చెరొక ఫిర్యాదులు వచ్చాయి. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అడిషనల్ కమిషనర్ (జనరల్) డాక్టర్ ఏ మహేష్ తో పాటు అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్స్) కే.వీ సత్యవతి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నవళి, చీఫ్ ఇంజనీర్ ఎం. ప్రభాకర్ రావు, చీఫ్ సిటీ ప్లానర్ జీ.వి. జీ. ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, డీఎఫ్ఓ మరియు డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ మాల్యాద్రి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి.సోమశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.