ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త :
పిల్లల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచడానికి ఒలింపిక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని జిల్లా క్రీడా సాధికారిక అధికారి డి ఎమ్ ఎమ్ శేషగిరి పేర్కొన్నారు. సోమవారం స్థానిక జెడ్పీ బాలికొన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి నిర్వహించిన ర్యాలీలో క్రీడా అధికారులు బాస్కెట్ బాల్ కోచ్ ఎమ్. మోహన్ దాస్, యోగా కోచ్ బీవిజీ నాగేంద్ర, ప్రధానోపాధ్యాయులు ఐ . ప్రసన్న కుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమారి మాట్లాడుతూ, ఒలింపిక్ క్రీడలలో భారతదేశం తరపున పాల్గొన్న క్రీడాకారులకు మద్దతు గా ర్యాలీలు నిర్వహించడం, విద్యార్ధుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచడానికి ఇటువంటి ర్యాలీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. క్రీడలు ద్వారా మానసిక దృఢత్వం తో పోటీతత్వం పెరుగుతుందని బాస్కెట్ బాల్ కోచ్ మోహన్ దాస్ తెలిపారు. తొలుత జెండా ఊపి ఒలింపిక్ ర్యాలీ ని ప్రధానోపాధ్యాయులు ప్రారంభించడం జరిగింది.
Tags rajamandri
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …