విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హిందూపురంలో న్యాయవాది,కాంగ్రెస్ పార్టీ నాయకులు దళితుడు అయిన సంపత్ కుమార్ ను హత్య జరిగి 3 మాసాలు అయిన ఇంతవరకు దోషులను అరెస్ట్ చేయలేదని దీని వెనుక పోలీసులతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు ఉన్నారని తక్షణం చర్యలు తీసుకొవాలని లేకుంటే కోర్టు ద్వారా సిబిఐ విచారణ కోరుతామని మాజీ పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు జి.వి.హర్ష కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కోడికత్తి శీను అంశంలో ఎవరికి సాధ్యం కాని సమయంలో అబ్దుస్ సలీంతో కలసి సంపత్ కుమార్ చాకచక్యంగా కోర్టులో వాదనలు ద్వారా శ్రీను ను బెయిల్ పై బయటకు తీసుకు వచ్చారన్నారు. ఈ సమావేశంలో మరో న్యాయవాది గగన, మడకశిర వాసులు కె. సోము కుమార్, ఎం. సోమన్న పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …