-డిఆర్వో వి. శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాల నుండి స్వీకరించిన అర్జీల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినప్పుడే ప్రజా సమస్యల పరిష్కార వేదిక లక్ష్యం నెరవేరుతుందని జిల్లా అధికారులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి జిల్లా రెవిన్యూ అధికారి వల్లభనేని శ్రీనివాసరావు తెలిపారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా డీఆర్‌వో వి.శ్రీనివాసరావు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్వో మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన విజ్ఞప్తులను నిశితంగా పరిశీలించి నిర్దేశించిన గడువులోపు వాటికి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. జిల్లా అధికారులు వారి శాఖకు సంబంధించిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించడం ద్వారా అర్జీదారుల అభినందన అందుకోవడంతో పాటు ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చినవారవుతారన్నారు. క్షేత్రస్థాయి అధికారుల సమన్వయంతో అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 140 అర్జీలు అందగా.. వీటిలో రెవెన్యూ-47, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి-20, పంచాయతీరాజ్-20, పోలీస్-14, ఏపీసీపీడీసీఎల్-3, డీఆర్‌డీఏ-3, డ్వామా-3, వైద్యఆరోగ్యం-3, సర్వే సెట్టిల్మెంట్-3, సహకార శాఖ-2, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం-2, విద్య-2, గృహ నిర్మాణం -2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్-2, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల-1, బీసీ వెల్ఫేర్-1, సివిల్ సప్లై-1, కాలేజ్ ఎడ్యుకేషన్-1, ఉపాధికల్పన -1, దేవాదాయ-1, గ్రామ వార్డు సచివాయలు-1, ఐసీడీఎస్ -1, ఇరిగేషన్-1, రహదారులు-భవనాలు-1, గ్రామీణ నీటి సరఫరా -1, సోషల్ వెల్ఫేర్ -1, ఖజానా శాఖ -1, గిరిజన సంక్షేమం -1 మొత్తం 140 అర్జీలు స్వీకరించగా వాటిలో 79 అర్జీలను స్వయంగాను, 61 ఆన్లైన్ ద్వారా స్వీకరించడం జరిగిందని డిఆర్వో శ్రీనివాసరావు తెలిపారు.