రాష్ట్రంలో గ‌త ఐదేళ్లుగా ఉపాధి హామీ కార్మికుల‌కి ఆల‌స్యంగా వేత‌నాలు

-ప‌రిహారంగా రూ. 81,03,406 ల‌క్ష‌లు చెల్లింపు
-జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం ప్ర‌శ్నించిన ఎంపి కేశినేని శివ‌నాథ్ 

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
మ‌హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం కింద ఆంధ్ర ప్ర‌దేశ్ లో గ‌త ఐదేళ్లుగా ప‌ని అడిగిన కార్మికులు ఎంత మంది వున్నారు? వారిలో ఎంత మంది కార్మికుల‌కి ఉపాధి అవ‌కాశం క‌ల్పించారో… జిల్లాల వారీగా ఆ కార్మికుల సంఖ్య వివ‌రాలు చెప్పాలంటూ కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖను విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ మంగ‌ళ‌వారం పార్ల‌మెంట్ ప్ర‌శ్నోత్తరాల స‌మ‌యంలో ప్ర‌శ్నించారు. అలాగే మ‌హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం కింద కార్మికుల‌కి వేత‌నాల చెల్లింపు లో ఏమైనా ఆల‌స్యం జ‌రిగిందా? జ‌రిగితే ఆ వివ‌రాలు జిల్లాల వారీగా ఇవ్వాల‌ని కోరారు? అలాగే ఆల‌స్యంగా జ‌రిగిన వేతనాల చెల్లింపుకు ప‌రిహారం చెల్లించటం జ‌రిగిందా? జ‌రిగితే ఆ వివ‌రాలు? జ‌ర‌గ‌క‌పోతే ఎందుకు జ‌ర‌గ‌లేదో ఆ కార‌ణాలు తెలపాలంటూ కోర‌టం జ‌రింది.

ఈ ప్ర‌శ్న‌ల‌కు కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రి కమలేశ్ పాశ్వాన్ బదులిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ 2019 నుంచి 2024 వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా మ‌హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం ఉపాధి కోరిన కార్మికుల సంఖ్య‌ 4,48,49,710 వుండ‌గా, ఉపాధి పొందిన కార్మికుల సంఖ్య 3,73,35,517 వుంద‌ని తెలిపారు. అలాగే మ‌హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం కింద ప‌నులు చేసిన కార్మికుల‌కి ఆల‌స్యంగా జ‌రిగిన వేత‌నాలకు ప‌రిహారంగా గ‌త ఐదేళ్ల‌లో రాష్ట్ర వ్యాప్తంగా రూ. 81,03,406 ల‌క్ష‌లు చెల్లించిన‌ట్లు తెలిపారు.

అదే విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 లో ఈ ప‌థ‌కం కింద వంద శాతం ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్లు (FTOలు) మస్టర్ రోల్స్ ముగిసిన 15 రోజులలోపు సిద్దం చేయ‌టం జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఇక కార్మికులకి బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ ఖాతాలలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ప్రోటోకాల్ ప్రకారం నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (Ne-FMS) ద్వారా చెల్లించటం జ‌రుగుతుంద‌ని వివ‌రించారు. వేతనాలు చెల్లింపులో ఆలస్యం జరిగితే, మస్టర్ రోల్ ముగిసిన పదహారవ రోజు తరువాత రోజుకు 0.05% రేటు ప్రకారం ఆలస్యానికి పరిహారం చెల్లించటం జ‌రుగుతుంద‌న్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *