విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పారిశ్రామిక వేత్తగా వ్యాపార రంగంలో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న దేవినేని బాజి ప్రసాద్ చిరస్మరణీయులుని వైసీపీ తూర్పు ఇంచార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. విజయవాడలో రాజకీయాల అతితంగా నాడు పేద విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలు, వివక్ష చూసి యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ వారికి అండగా నిలిచిన బాబాయి స్వర్గీయ దేవినేని బాజి ప్రసాద్ ఆశయసాధనకుకృషి చేసారు అని అన్నారు.స్వర్గీయ దేవినేని నెహ్రూ కి రాజకీయంగా కుటుంబాపరంగా అండగా ఉండి పేదప్రజల సమస్యల పరిష్కరానికి కృషి చేశారని అన్నారు. శుక్రవారం బాజిప్రసాద్ గారి 8వ వర్ధంతి కార్యక్రమాన్ని గుణదల తూర్పు నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు నాయకులు, అభిమానుల నడుమ ఘనంగా నిర్వహించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ నేడు భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా విద్యార్థులు ఇప్పటికి ఆయన సేవలను గుర్తుచేసుకొంటారని అంతలా ఆయన వారి గుండెల్లో నిలిచివున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి.ఎమ్.సి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,కో-ఆప్షన్ సభ్యులు ముసునూరు సుబ్బారావు,కార్పొరేటర్లు భీమిశెట్టి ప్రవల్లిక,కలపాల అంబేద్కర్ మరియు వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,దేవినేని అభిమానులు, వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …