ఈనెల 15వ తేదీన అన్న క్యాంటీన్ల ప్రారంభం..

-నిర్వహణకు పనులను పూర్తి చేసి సిద్దం చేయండి..
-జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన.

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిరుపేదలకు తక్కువ ధరకే భోజనాన్ని అందించే అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. ఈనెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను లాంచనంగా ప్రారంభించనున్న దృష్ట్యా నగరంలో ప్రారంభించే అన్న క్యాంటీన్ల నిర్వహణ పనులను రేపటికల్ల పూర్తి చేసి సిద్దం చేయాలన్నారు. దీనిలో భాగంగా వన్‌టౌన్‌ గాంధీ పార్కు వద్ద, అలంకార్‌ ధర్నాచౌక్‌ వద్ద అన్న క్యాంటీన్లను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన నగరపాలక సంస్థ కమీషనర్‌ హెచ్‌ యం ధ్యాన చంద్ర, ఆర్‌డివో బిహెచ్‌ భవానీ శంకర్‌లతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అన్న క్యాంటీన్ల ద్వారా నిరుపేదలకు నాణ్యమైన ఆహారాన్ని ఐదు రూపాయలకు అందించనున్నారన్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టే ఉద్దేశంతో అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నామన్నారు. క్యాలిటీ, క్యాంటిటీ విషయంలో రాజీ పడకుండా నాణ్యమైన ఆహారాన్ని అందించే విధంగా సిద్దం చేయాలన్నారు. ప్రతి రోజు ఉదయం ఆల్ఫాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం మూడుపూటలా అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు 15 రూపాయలకే లభ్యం కానున్నదన్నారు. ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసి సిద్దం చేయాలని కలెక్టర్‌ జి. సృజన అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *