విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మెంబర్ బత్తుల పద్మావతి విజయవాడ అర్బన్ పటమట దర్శిపేట లోని కొమ్మా సీతారామయ్య జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాల మరియు అంగనవాడి కేంద్రాలను సందర్శించటం జరిగింది. విద్యార్థులతో చైల్డ్ రైట్స్ గురించి మాట్లాడటం జరిగింది. స్కూల్ లో కంప్లీట్ బాక్స్ సరిగా వినియోగించట్లేదు, తరగతి గదిలో కి బయట నుండి డ్రైనేజీ వాసన వస్తుంది. అంగనవాడి కేంద్రాలలో టాయిలెట్స్ లేవు అని గమనించారు. విద్యార్థులు స్కూల్ నుండి ఇంటికి వెళ్లే దారిలో అబ్బాయిలు ర్యాగింగ్ చేస్తున్నారు అని విద్యార్థులు చెప్పారు వెంటనే సి ఐ కి ఫోన్ చేసి విషయం చెప్పి పెట్రోలింగ్ ఏర్పాటు చేయమని సూచించారు. అంగనవాడి కేంద్రాలను వేరే బిల్డింగ్ కు మార్చమని సూచించారు. రిజిస్టర్లును మరియు స్టాక్ ను చెక్ చేశారు. ఈ కార్యక్రమం లో సీడీపీఓ నాగమణి డీసీపీవో యమ్. రాజేశ్వరరావు. మండల విద్యా శాఖ అధికారి రాజశేఖర్, Sliding ప్రధానోపాధ్యాయులు మురళి రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …