-నమోదు కోసం రైతు సేవా కేంద్రాలను సంప్రదించండి
-జిల్లా లక్ష్యం 9 వేల హెక్టార్లు .. రాయితీ ద్వారా 6యూనిట్స్ స్థాపన
– పధక సంచాలకులు అడపా దుర్గేష్
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
భూగర్భ జలాలు అడుగంటిన తరుణంలో బిందు సేద్యముతో తక్కువ నీటితో ఎక్కువ నాణ్యమైన పంట దిగుబడిని పొందవచ్చునని ఏపి – ఎమ్ఐపి ప్రాజెక్టు డైరక్టర్ అడపా దుర్గేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బిందు సేద్యం విధానంలో నీటితో కరిగే ఎరువులను ఫెర్టిగేషన్ విధానం ద్వారా అందించుటకు ఎరువులపై ఖర్చు తగ్గుతుందన్నారు. ఎరువుల వినియోగ సామర్ధ్యం పెరిగి పంట దిగుబడి మరియు నాణ్యత పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ బిందు సేద్యంతో కూలీల ఖర్చు తగ్గును, కలుపు మొక్కలు నివారించడం, చీడ పీడల వ్యాప్తి తక్కువగా వుంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సూక్ష్మ సేద్యం పథకము కింద తూర్పు గోదావరి జిల్లాకు 2024-25 సంవత్సరమునకు 9,000 హెక్టార్లు భౌతిక లక్ష్యాముగా నిర్దేసించియున్నారని దుర్గేష్ తెలిపారు. బిందు మరియి తుంపర సేద్య పరికరములు ప్రభుత్వ రాయితీపై పొందగోరు రైతులు సమీప రైతు సేవ కేంద్రములలో రైతు యొక్క ఆధార్ కార్డు, భూమి యాజమాన్య పత్రం నకలు తో, తమ పేర్లను విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ / విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ / విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ ద్వారా ఎ.పి.ఎం.ఐ.పి. యుప్ లో నమోదు చేసుకోవాలని పథక సంచాలకులు తెలిపారు.
రాయితీ వివరములు:
బిందు సేధ్యమునకు గాను 5 ఎకరములలోపు వున్నా రైతులు 90% మరియు 5 నుండి 12.5౦ ఎకరములు పైన ఉన్న రైతులకు 50% రాయితీ వర్తించబడును తుంపర సేధ్యమునకు గాను 5 ఎకరములలోపు వున్నా రైతులు 55%, 5 ఎకరములు పై బడిన రైతులకు 45% రాయితీ తో తుంపర సేద్యం పరికరాలు అందించబడును. కావున జిల్లా లని రైతాంగం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.