Breaking News

ఘనంగా నిర్వహించిన ప్రపంచ ఆదివాసి దినోత్సవం

-ఆర్ట్స్ కాలేజి నుంచి కంబాల చెరువు వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ
-మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్నది కంటే.. ఏమి సాధించాం అన్నదే ముఖ్యం
– ఆదిశగా  గిరిజన విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని భవిష్యత్ తరాలుకు ఆదర్శంగా నిలవాలి.
-కలెక్టర్ పి.ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్న దాని కంటే.. ఏమి సాధించాం అన్నదే ముఖ్యమని, ఆదిశగా  గిరిజన విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని మంచి భవిష్యత్ తో తరాలుకు ఆదర్శంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి శాసన మండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ చౌదరి, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, ఎస్పీ డి. నరసింహ కిషోర్,  ఇంచార్జి జేసీ, డిఆర్ఓ జే. నర్సింహులు, ఆర్డీవో ఇంచార్జ్ శివజ్యోతి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు కేఎన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ ఆదివాసీలుగా పుట్టిన అనేక మంది ప్రముఖులు అయ్యి చాలా సాధించి, చరిత్రలో వారి కొరకు కొన్ని పేజీలు కేటాయించుకున్నారని, అదే తరహాలో  గిరిజన విద్యార్థులైన మీరందరూ లక్ష్యాలు నిర్ణయించుకొని  సాధన చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు.  గిరిజన విద్యార్థుల చదువుతున్న పాఠశాలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు,  సాధారణ పాఠశాలలోను వారికి  మౌలిక సదుపాయాల అందించే దిశగా ఈ ఏడాది ఆచరణ ప్రణాళిక ద్వారా అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు చెడు పట్ల ప్రభావితం కాకుండా నిర్దేశించుకున్న లక్ష్యసాధన దిశగా దృష్టి సారిస్తే  మంచి ఫలితాలు సాధ్యమై ఉన్నత స్థానాలను అధిరోహించడం జరుగుతుందన్నారు. ధైర్య సాహసాలు గల ప్రతి విద్యార్థి  క్రీడల పట్ల ఆసక్తి కనబరచాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుంటూ   ఉన్నత స్థానాల్లో ఉంటూ  ఏ సమాజం నుంచి మనం వచ్చామో వారిని అభివృద్ధి చేసే దిశగా ఎదగాలని సూచించారు. స్వాతంత్ర సమరయోధులైన బిల్సా ముండ, కొమరం భీమ్  లను మనం గుర్తు చేసుకుని నివాళులర్పించు కుంటున్నామన్నారు. మనం ఎక్కడి నుంచి వచ్చాం అన్నది కంటే.. ఏమి సాధించాం అన్నదే ముఖ్యమని, ఆ దిశగా గిరిజన ప్రాంతంలో పుట్టిన వీరు  గాంధీజీ, నెహ్రూ వలె గిరిజన ప్రాంతాల్లోని స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వీరిని మనం స్మరించుకుంటున్నమన్నారు. గిరిజనులను సైన్యముగా చేసుకుని అల్లూరి సీతారామరాజు పోరాడారన్నారు. మనిషి జీవితం ఎలా ఉండాలి అనే విధంగా పెద్ద గ్రంథాన్ని  రామాయణ రూపంలో  మనకు అందించారని వాల్మీకిని ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్   విద్యార్థులకు సూచించారు. శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ చౌదరి మాట్లాడుతూ  మనమందరం పూర్వికుల వారసులమని, ఆదివాసీలు సంస్కృతి సాంప్రదాయాలకు కట్టుబడి ఉన్నారన్నారు. పోడు వ్యవసాయం చేస్తూ , అటవీ సంపదను  రక్షించే వారిని తెలిపారు. ప్రతి దేశంలోని ఆదివాసుల సమస్యలను తెలియ జేసుకునేందుకు ప్రపంచ ఆదివాసి దినోత్సవం  ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.  గిరిజనుల కొరకు కేంద్ర ప్రభుత్వం అందించే వందన్ వికాస్ యోజన  పథకం  జిల్లాలోను అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని తెలియజేశారు. గిరిజన ప్రాంతాల్లో శిశు మరణాల నివారణ కొరకు వైద్య సదుపాయాలు, రవాణా కొరకు రహదారులను నిర్మించే అభివృద్ధి చేపట్టాలన్నారు. గిరిజను ఉత్పత్తులను కొనుగోలు చేసి  ప్రోత్సహించే విధంగా కృషి చేయాలన్నారు. స్థానిక శాసనసభ్యులు  గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ  అమాయకులైన గిరిజనుల్లో చైతన్యం తెచ్చేందుకు వారి సమస్యలపై గతంలో తాను పోరాటం కూడా చేయడం జరిగిందన్నారు. తాను ప్లానింగ్ బోర్డు సభ్యుడుగా ఉన్నప్పుడు  స్వర్గీయ ఎన్టీఆర్ కర్నూలు జిల్లాలోని   పాఠశాలలను సందర్శించినప్పుడు విద్యార్థులు పడుతున్న అవస్థలను చూశారన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలను ఉన్నత వర్గాలతో సమానం చేసేలా  ఎన్టీఆర్ మొట్ట మొదటిగా గిరిజన ఆశ్రమ పాఠశాలను రంపచోడవరం లో ప్రారంభించారన్నారు. ఆంధ్రప్రదేశ్లో 33 గిరిజన తెగలు ఉన్నాయన్నారు. విద్యార్థుల కొరకు రాష్ట్ర ప్రభుత్వం విదేశీ విద్యకు 20 లక్షల పైగా వెచ్చిస్తుందని  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  విద్యార్థులు సాంకేతిక నైపుణ్యత  పై దృష్టి సారించి  సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉండి తోటి వారికి ఆదర్శంగా ఉండాలన్నారు. జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ మాట్లాడుతూ చదువు వలన మంచి చెడు మధ్య తేడా తెలుసుకునే విచక్షణ జ్ఞానం వస్తుందన్నారు. స్త్రీలు విద్యావంతులుగా ఉన్న ఆ సమాజం అభివృద్ధి చెందు తుందని పేర్కొన్నారు. విద్యార్థులు జీవితంలో లక్ష్యాన్ని ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా కృషి చేయాలనలన్నారు. గిరిజన మహిళ ద్రౌపతి ముర్ము   భారత రాష్ట్రపతిగా ఉన్నారని వారిని ప్రతి గిరిజనులు ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినిలు గిరిజన సాంప్రదాయ నృత్య , సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమెంటోళ్లు అందించారు. అంతకు ముందు స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణ నుంచి కంబాల చెరువు వరకు నిర్వహించిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ ర్యాలీలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ చౌదరి, శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, భత్తుల బలరామకృష్ణ, ఎస్పీ కిషోర్,  ఇంచార్జి జేసీ, డిఆర్ఓ జీ. నరసింహులు, రాజమండ్రి ఇన్చార్జి ఆర్డీవో కె.ఎల్ . శివజ్యోతి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు కేఎన్ జ్యోతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మల్లి భాస్కర్, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *