సెప్టెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ గంధం సునీత రాజమహేంద్రవరం పరిధిలోని అందరి న్యాయమూర్తులతో మరియు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లోని ఇతర న్యాయమూర్తులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం లో అందరి న్యాయమూర్తులతో మాట్లాడుతూ సెప్టెంబర్ 14 వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు అధిక మొత్తంలో సివిల్ కేసులు, రాజీయోగ్యమైన క్రిమినల్ కేసులు, మోటారు వాహనాల యాక్సిడెంట్, చెక్ బౌన్స్ కేసులు మరియు ప్రీ-లిటిగేషన్ కేసులు పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ఈ మేరకు పెండింగ్ లో ఉన్న అన్ని కేసులను గుర్తించి ఆ జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందజేయాలన్నారు. రాజీ పడదగిన అన్ని కేసులను గుర్తించి వాటిని అధిక సంఖ్యలో పరిష్కరించాలని చెప్పారు. అనంతరం వివిధ చిట్ ఫండ్ సంస్థల ప్రతినిధులు మరియు ఆ సంస్థల న్యాయవాదులతో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 14 వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు అధిక మొత్తంలో, బాధితులకు తగు పరిహారం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ఈ మేరకు పెండింగ్ లో ఉన్న ఆయా సంస్థల సివిల్ మరియు కాంపౌండబుల్ క్రిమినల్ కేసులను గుర్తించి ఆ జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందజేయాలన్నారు .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *