-జిల్లాలో రహదారి ప్రమాదా లను నివారించేందుకు పటిష్ట మైన కార్యచరణను అమలు చేయండి.
– హెల్మెట్ ధారమ తప్పనిసరిగా వాహన ఛోదకులు వినియోగించే విధంగా చర్యలు
– జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు పటిష్టమైన కార్యచరణ రూపొందించడం, భద్రతా ప్రమాణాలను సమర్థవంతంగా అమలు చేసేవిధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం జిల్లా కలక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎస్పీ డి. నరసింహ కిషోర్, ఇన్చార్జి జేసీ జి. నరశింహులు , జిల్లా రవాణా అధికారి కెవి కృష్ణా రావు, ఇతర సమన్వయశాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ప్రమాదాలను నివారించే దిశలో వాటిపై సమగ్ర అద్యాయనం చేసేందుకు భవిష్యత్ లో వాటిని నివారించేందుకు సమన్వయ శాఖలతో కలసి రూపొందించిన సమీకృత రోడ్డు ప్రమాద డేటాబేస్ నందు ఎప్పటి కప్పుడు వివరాలను నమోదు చ యాలని ఆదేశించారు. జాతీయ రహదారుల పై ప్రమాధాల నివారణ కొరకు నేషనల్ హైవే అధారిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ఇందు కోసం స్మార్టు సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి వాహనాలు వేగ నియంత్రణ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు కారణంగా ప్రజల గాయ పడకుండా, మృతి చెం దకుండా చేపట్ట వలసిన చర్యలపై సంభందిత శాఖల అధికారులతో ప్రణాళికా సిద్దం చేసుకొని భాదితులుకు సహాయం అందించే సమాయాన్ని అంచనా వేసి గోల్డేన్ అవర్ లోగా వైద్య సేవలు అందించి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడాలన్నారు. ఆమేరకు నివేదికను సిద్దం చేసి అద్యాయనం చేయాలన్నారు. ఆదిశలో జిల్లాలో రహదారి ప్రమాదాల వల్ల వైకల్యంకి గురి కావడం కానీ, మరణించడం కానీ జరు గకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం సాద్యమవుతుందన్నారు. భద్రతా సమావేశాల్లో సూచించిన అంశాలను అమలు చేయడం పై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఎన్ని సిసి కెమెరాలు ఏర్పా టు చేశారు, ఎన్ని కెమెరాలు పని చేస్తు న్నాయనే వివరాలను అధికారులను అడిగి తెలుసు కున్నారు. జిల్లాలో రోడ్లపై వాహనదారులు రోడ్డుకు అడ్డంగా వాహనాలను నిలుపు పుదల చేస్తున్నారని, వీటి వల్ల ట్రాఫిక్ జామ్ జరుగుతున్నా యని తెలిపారు. రోడ్లపై వాహ నాలు నిలపకుండా ఆర్టీవో అధికారులు చర్యలు చేపట్టా లని తెలిపారు. రాజమండ్రిలో ఎటువంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా వర్టికల్ పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా ఎస్పీ డి. నరశింహా కిషోర్ మాట్లాడుతూ నగరలో, జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి బ్లాక్ స్పాట్లని గుర్తించడం జరిగిందన్నారు. ఆయా ప్రదేశాల్లో ప్రమాద హెచ్చరికల సూచికలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని సంబందిత శాఖల అధికారులకు సూచించామన్నారు. జాతీయ రహదారుల్లో హైవే పెట్రోలింగ్ వాహనాల ద్వారా నిరంతర నిఘా ఏర్పా టు చేస్తున్నామన్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో గత రెండు సంవత్సరాలతో పోలిస్తే భద్రతా చర్యలు చేపట్టడం వల్ల ప్రమాదాల వల్ల గాయాలు బారిన పడిన వాటి సంఖ్య తగ్గించడం జరిగిందనీ అధికారులు తెలియచేశారు. హిట్ అండ్ రన్ కి సంబంధించి గాయ పడిన వారికి రూ. 50 వేలు, మరణించిన వారికి రూ 2 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం పరిహారం అందచెయ్యనున్నట్లు తెలియ చేశారు. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి జేసీ,డిఆర్వో జి. నరశింహులు, జిల్లా రవాణా అధికారి కె. ఎస్. ఎం. వి. కృష్ణా రావు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సి హెచ్. సంపత్ కుమార్ , ఎస్. ఎస్. రంగనా యకులు, జి. రామనారాయణ, బి. ఎస్. ఎస్. నాయక్, సహా య మోటార్ వెహికల్ ఇన్స్పె క్టర్లు ఎన్. ఎల్. దేవి, కార్యా లయ పర్యవేక్షకులు ఎల్. పెన్సి న్ బాబు మరియు తదితర జి ల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.