-ఆగష్టు 13 లోగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం
-డి ఎస్ డబ్ల్యూ ఓ ఎమ్.సందీప్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా మాన్యువల్ స్కావెంజర్ల సర్వే జిల్లా కమిటి ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్. సందీప్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. నిబంధనలను అనుసరించి ఆసక్తి కలిగిన వారు ఆగష్టు 13 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కమిటీలో నలుగురు సభ్యులుంటారని, వారిలో మాన్యువల్ స్కావెంజర్స లేదా పారిశుధ్య కార్మికుల కోసం పనిచేసే ఇద్దరు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, అలాగే వారి కోసం పనిచేసే సంఘాల్లోని ఇద్దరు ప్రతినిధులు ఉంటారని తెలిపారు. ఈ నలుగురిలో ఒకరు మహిళా సభ్యులు ఉంటారని వివరించారు. ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాలలో ఈనెల (ఆగష్టు) 13వ తేదీ లోపు జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ, సాధికారిత కార్యాలయం, సబ్ కలెక్ట రేట్ ప్రాంగణం, రాజమహేంద్రవరంలో దరఖాస్తులను అందించాలని కోరారు. ఇతర వివరాలకు ఫోన్ నెంబర్ 79934 99820 ను సంప్రదించాలని కోరారు.