పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో “77” ఫిర్యాదులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాసమస్యల సత్వర పరిష్కారం కోసం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి 13.00 గంటల వరకు ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపధ్యంలో సోమవారం పోలీస్ కమిషనర్ వారి కార్యాలయంలో ఎన్.టీ.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.యస్ ఆదేశాలు మేరకు అడ్మిన్ డి.సి.పి.ఎం.కృష్ణమూర్తి నాయుడు  “ప్రజా సమస్యల పరిష్కార వేదిక”( పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం) కార్యక్రమాన్ని నిర్వహించి బాధితులు నుండి వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 77 ఫిర్యాదులపై భాదితులతో మాట్లాడటంతో పాటుగా, దివ్యాంగులు, వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు గురించి అడిగి తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఫోన్ ద్వారా సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ లతో మాట్లాడి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడమైనది. ఈరోజు అందిన ఫిర్యాదుల్లో నగదు లావాదేవీలకు సంబంధించినవి 13, భార్యాభర్తలు, కుటుంబ కలహాలకు సంబంధించినవి 15, భూవివాదాలకు సంబంధించినవి 05, వేధింపులకు సంబందించి 06 మరియు వివిధ మోసాలకు సంబంధించినవి 27, ఇతర చిన్న చిన్న వివాదాలు సమస్యలకు, సంఘటనలకు సంబంధించినవి 11, మొత్తం 77 ఫిర్యాదులును స్వీకరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డి.సి.పి. ఎం.కృష్ణమూర్తి నాయుడు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని ఫిర్యాదులు పరిష్కరించుటలో సహకారాన్ని అందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *