గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఇస్తున్న ఆర్జీలను అధికారులు భాధ్యతతో పరిష్కరించాలని, విభాగాధిపతులు పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న ఆర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని గుంటూరు నగర కమిషనర్ (ఎఫ్ఏసి) ఎస్.హరికృష్ణ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ పిజిఆర్ఎస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకొని అధికారులతో మాట్లాడుతూ నగర ప్రజలు తమ స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో అందించే ఆర్జీల పరిష్కారానికి విభాగాధిపతులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సమస్యను బట్టి అవసరమైతే విభాగాధిపతులు ఆర్జీలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు. ప్రజల నుండి అందిన ఆర్జీలను సమగ్రంగా పరిష్కారం చేయాలని, అవే అర్జీలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. పారిశుధ్యం, త్రాగునీటి సరఫరా, రోడ్ల ఆక్రమణ వంటి సమస్యల పరిష్కారం కోసం ప్రజలు జిఎంసి కార్యాలయానికి వస్తున్నారని, అవి స్థానికంగానే పరిష్కారం చేయాలన్నారు. ప్రతి సోమవారం అందే ఫిర్యాదుల పరిష్కార నివేదికను తదుపరి వారం జరిగే సమావేశంలో అందించాలన్నారు. ఫిర్యాదులకు ఇచ్చే ఎండార్స్మెంట్ ను ఆయా విభాగాధిపతులు పరిశీలించాలన్నారు. ఫిర్యాదుల పరిష్కారం అనంతరం ఫిర్యాదికి సమాచారం తెలియచేయాలన్నారు. సమస్య పరిష్కారంకు ముందు, తర్వాత ఫోటోలు జత చేయాలన్నారు. సోమవారం నిర్వహించిన పిజిఆర్ఎస్ కు 36 ఫిర్యాదులు అందాయని వాటిలో పట్టణ ప్రణాళిక విభాగం 13, ఇంజినీరింగ్ విభాగం 10, రెవెన్యూ విభాగం 3, ప్రజారోగ్య విభాగం 6, ఎడ్యుకేషన్ విభాగం 1, అకౌంట్స్ విభాగంకి సంబందించి 3 ఫిర్యాదులు అందాయని, వాటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ కె.రాజ్యలక్ష్మీ, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, వెంకట లక్ష్మీ, ఎస్ఈ శ్యాం సుందర్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఎంహెచ్ఓ మధుసూదన్, మేనేజర్ ప్రసాద్, ఉపా సెల్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, డి.సి.పి.లు, ఈఈలు, ఆర్ఓలు, ఎస్.ఎస్.లు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …