-గత ఐదేళ్ల పాలనలో సహజ వనరుల్ని దోచుకున్నారు
-శాస్త్ర సాంకేతికంగా మైనింగ్ శాఖను పటిష్ట పరిచేలా చర్యలు తీసుకుంటాం
-నేషనల్ మినలరల్ ఎక్స్ ప్లోరేషన్ ట్రస్ట్ 6వ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర
న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో అంతులేని సహజ వనరులున్నాయని, వాటిని రాష్ట్ర అబ్యున్నతికి వినియొగిస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు & ఎక్ష్సెజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఢిల్లీలో కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి, అనుశాఖ సహాయమంత్రి డా.జితేంద్ర సింగ్, కేంద్ర మైనింగ్ శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దుబే ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ మినలరల్ ఎక్స్ ప్లోరేషన్ ట్రస్ట్ 6వ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జ్ఞాపిక అందించి, శాలువాతో మంత్రి కొల్లు రవీంద్ర సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ లో అపారమైన సహజ వనరులు, విభిన్నమైన ఖనిజ వనరులు ఉన్నాయని, వాటిని సరైన మార్గంలో వినియోగించుకుంటే రాష్ట్రం అభివృద్ధిలో దేశానికి మార్గదర్శిలా నిలుస్తుందని అన్నారు. వనడియం, టైటానియం, నికెల్, ఫోస్పోరైట్, ఫాస్ఫేట్, గ్రాఫైట్, లిథియం, ప్లాటినం లాంటి విలువైన వనరులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న వనరులని సాంకేతికంగా వినియోగించుకోవడమే లక్ష్యంగా 1996 లో నేషనల్ మినరల్ ఎక్స్ ప్లోరేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. మినరల్స్ తవ్వకాలకు 2% సీనరేజ్ ఫీజుగా నిర్ణయించారు. ఆ సొమ్మునే రాష్ట్ర ఖనిజన్వేషణకు వినియోగిస్తున్నారు. ఈ వ్యవస్థ సేవలను సమగ్రంగా వినియోగించుకోవడం, మెరుగు పరచడమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నాం. అదే సమయంలో రాష్ట్రంలోని మైనింగ్ కార్యకలాపాలపై సమగ్ర నిఘా కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయడలిచామని, అందుకు కేంద్ర ప్రభుత్ర గనుల శాఖ కార్యదర్శి కాంతారావుని సహకారం అందించాలని అడిగారు.
ఆంధ్రప్రదేశ్ కు దాదాపు 972 కి.మీ.ల తీర ప్రాంతం ఉన్నందున సముద్ర ప్రాంతంలో వనరుల అన్వ్హేషణకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. తద్వారా.. పాలీమెటాలిక్ నోడ్యూల్స్, పాలీమెటాలిక్ సల్ఫైడ్‌లు మరియు ఇతర వనరులు కూడా అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఆఫ్‌షోర్ మైనింగ్ యాక్ట్ 2002కి ఇటీవలి సవరణలు, ఆఫ్‌షోర్ ఖనిజాలున్న ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడానికి వీలు కల్పించడంపై చర్చించారు. తీరప్రాంత రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడేందుకు రాబోయే ఆఫ్‌షోర్ మైనింగ్ నిబంధనలను పరిశీలించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని విన్నవించారు. ఆఫ్‌షోర్ మైనింగ్ వేలంలో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉందని, అందుకోసం ప్రత్యేకంగా సీ బెడ్ మైనింగ్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. కార్యక్రమంలో అస్సాం మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి జోగన్ మోహన్, ఛత్తీస్ ఘర్ ఆరోగ్య శాఖ మంత్రి శ్యాం బిహారి జైస్వాల్, గుజరాత్ పరిశ్రమల శాఖ మంత్రి బల్వంత్ సింగ్ రాజ్ పుత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.