విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ది మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్, రాష్ట్ర అధ్యక్షులు డా. వేముల భాను ప్రకాష్ సోమవారం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖా మాత్యులు సత్యకుమార్ యాదవ్ ని సెక్రటేరియట్ లో ఆయన ఛాంబర్ లో కలిసి కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం లో ఆయుష్ చికిత్సలు చేర్పించాలని, అందుకురాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ప్రపోజల్స్ కేంద్రప్రభుత్వం కి పంపించేటట్లు సహకరించాలని కోరారు. ఈ విషయం పై మంత్రి స్పందిస్తూ కేంద్రప్రభుత్వం ఆయుష్ అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ దృష్టికి ఈ విషయం తీసుకొని వెళ్తాము అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టం ఆఫ్ మెడిసిన్ ఏర్పాటు, ఆయుష్ వైద్యులకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా బిల్లులు రాబోవు మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టేటట్లు చూడాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయుష్ వైద్యుల సమస్యలు ని ఎంతో ఓపికగా విని వాటి పరిష్కారానికి కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. ఆయుర్వేద ఇండస్ట్రీ కి సంబంధించిన “ఎక్స్పర్ట్ ప్యానెల్ కమిటీ” ఏర్పాటు కి సంబంధించిన ఫైల్ మంత్రి పరిశీలన లో ఉన్న విషయం తెలుపగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయుష్ అభివృద్ధికి కృషి చేస్తున్న ఆరోగ్య శాఖా మంత్రికి అసోసియేషన్ తరుపున ధన్యవాదాలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో అసోసియేషన్ సభ్యులు డా. యం.ఆదర్శ్ వున్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …