Breaking News

“వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ 2047” అంశంపై వర్క్ షాప్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
2029 నాటికి రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిని (GSDP) ఏవిధంగా సాధించాలి, వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ 2047 లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి అనే అంశంపై ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ ల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్లానింగ్ శాఖకు దిశా నిర్దేశం చేశారు అని, రాష్ట్ర ప్రణాళిక శాఖ సంయుక్త కార్యదర్శి అనంత శంకర్ తెలిపారు.
అన్ని జిల్లాల చీఫ్ ప్లానింగ్ అధికారులు, సహాయ స్టాటిస్టికల్ అధికారులతో సచివాలయంలోని ఐదవ భవనంలోని సమావేశ మందిరంలో “వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ 2047” అంశంపై రాష్ట్ర ప్రణాళిక శాఖ నేడు వర్క్ షాప్ నిర్వహించారు.
‘వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ 2047’ పై ప్రణాళిక శాఖ 2024-29 సంవత్సరాలకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ముసాయిదా విజన్ డాక్యుమెంట్‌ను జిల్లాల అధికారులకు వివరించారు.
వికసిత్ భారత్-2047 ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆర్థిక పురోగతి సాధించడమే నీతి ఆయోగ్ ప్రధాన లక్ష్యమని రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, ప్రైమరీ సెక్టార్ డెవలప్‌మెంట్, రెవెన్యూ ఆధారిత వృద్ధి వంటి అంశాల్లో రాష్ట్ర పరిస్థితులు, ప్రాముఖ్యత లను, స్థూల నుండి సూక్ష్మ విధానాన్ని అవలంబిస్తూ, విస్తృత లక్ష్యాలను గుర్తించి, వాటిని సాధించడమే నీతి ఆయోగ్ ప్రధాన ఉద్దేశం అని ఈ ముసాయిదాలో ప్రస్తావించారు.
దేశవ్యాప్తంగా అభివృద్ధి చేసే నగరాలలో ముంబయ్, సూరత్, వారణాశిలతో పాటు మన రాష్ట్రంలోని విశాఖపట్టణానికి నీతి ఆయోగ్ అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం గొప్ప పరిణామం అని, పర్యాటక రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, తీరప్రాంతాలు, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, అవసరమైన సౌకర్యాలు కల్పించడం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం సమగ్రాభివృద్ధిని సాధించాలనే లక్ష్యంగా పెట్టుకుందని, జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్య, ఆరోగ్య సంరక్షణ, ఇతర ప్రాథమిక సేవలలో గణనీయమైన పురోగతిని, ఈ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి జిల్లా సంవత్సరానికి కనీసం 15 శాతం వృద్ధి సాధించాలని, 2029 నాటికి అన్ని రంగాల్లో రాష్ట్రం పురోగతిపై ప్రజలకు విశ్వాసం కలిగించేలా జిల్లాల అధికారులు కృషి చేయాలని, మండల ఆధారిత కార్యాచరణ ప్రణాళికను కూడా అధికారులకు ఈ సమావేశంలో అవగాహన కల్పించారు. వ్యవసాయ అనుబంధ, విద్య, సాంఘిక సంక్షేమ, పరిశ్రమల, వైద్య ఆరోగ్య శాఖల నోడల్ అధికారులు వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ – 2047 కు జిల్లాల వారీ ప్రగతిలో భాగస్వాములు అని పేర్కొన్నారు.
ప్రణాళిక శాఖ సంచాలకులు శ్రీ రాంబాబు, ఇతర అధికారులు శ్రీ సీతాపతి, శ్రీ గోపాల్, శ్రీ శివ శంకర్, అన్ని జిల్లాల చీఫ్ ప్లానింగ్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *