విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్ధ – వెలుగు కార్యకలాపాలను మెరుగు పరిచి అభివృద్ధి పథంలో పయనింపజేయాలని, అందుకు అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్ధ, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్ధ కేంద్ర కార్యాలయంలో అధికారులతో బుధవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. స్వయం సహాయక సంఘాలను ప్రగతిశీలంగా పనిచేసేందుకు తక్షణ చర్యలను చేపట్టి వినూత్నంగా ముందుకు సాగాలని, ప్రస్తుతం ఉన్న 51వెలుగు మహిళా మార్టులు అత్యంత ప్రగతిశీలంగా వ్యాపారాభివృద్ధి కొనసాగించేందుకు అవసరమైన మేరకు పునరుత్తేజం చేయాలని, స్వయం సహాయక సంఘాలను చిన్న, సూక్ష్మ వ్యాపార సంస్థలు గాను, రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఉన్న మండల సమాఖ్యలను చిన్న,మధ్య తరహా వ్యాపార సంస్థలుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు.ఈ సమావేశంలో సెర్ప్ సిఇఓ వీరపాండ్యన్, డైరక్టర్లు, అదనపు డైరెక్టర్లు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …