వికసిత్ ఆంధ్రప్రదేశ్-2047 ప్రణాళిక రూపకల్పనలో ప్రజలంతా భాగస్వాములు కావాలి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వికసిత్ భారత్-2047లో భాగంగా వికిసిత్ ఆంధ్రప్రదేశ్-2047 ప్రణాళిక రూపకల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని దీనిలో ప్రజలందరూ భగస్వాములై వారి సూచనలు,సలహాలను అందించాలని రాష్ట్ర వ్యవసాయ,సహకార శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ పిలుపునిచ్చారు.78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్క రించుకుని గురువారం రాష్ట్ర సచివాలయం మొదటి భవనం వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించిన తదుపరి మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ ప్రశాంతంగా జీవిస్తున్నామంటే అందుకు ఆనాడు దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగఫలితమేనని గుర్తు చేశారు.
భారత దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం వికసిత్ భారత్-2047 కార్యక్రమాన్ని చేపట్టిందని స్పెషల్ సిఎస్ రాజశేఖర్ పేర్కొన్నారు.వికసిత్ ఆంధ్రప్రదేశ్-2047 ప్రణాళిక రూపకల్పనకు జిల్లాల్లో కార్యాచరణను రూపొందించడం జరుగుతోందని దానిలో ప్రజలంతా పాల్గొని ప్రభుత్వ పాలన ఏలా ఉండాలి రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పధంలో ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే దానిపై తగు సూచనలు,సలహాలను ఇవ్వాలని స్పెషల్ సిఎస్ రాజశేఖర్ విజ్ణప్తి చేశారు.
ఇటీవల తాను పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మూరుమూల ప్రాంతాన్ని సందర్శించానని అక్కడ ఒక వర్గం ప్రజలు ఈనాటికీ ఎలుకలను పట్టుకుని జీవనం సాగిస్తున్నారని అలాంటి కుంటుంబాలను అభ్యున్నతికి వికసిత్ ఆంధ్రప్రదేశ్-2047 ప్రణాళికలో తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ పేర్కొన్నారు.ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి సంక్షేమ పధకాల ఫలాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి లబ్దిదారుకు అందే విధంగా మనమంతా పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.ముఖ్యంగా రాష్ట్ర సచివాలయానికి వచ్చే అన్ని రకాల దస్త్రాలను సక్రమంగా నిర్వహించాలని అధికారులు,సిబ్బందికి ఆయన సూచించారు.
ఈకార్యక్రమంలో సాధారణ పరిపాలన శాఖ సంయుక్త కార్యదర్శ శ్రీనివాస్,డిఎస్ జనరల్ రామసుబ్బయ్య,సిఎస్ఓ కృష్ణమూర్తి,సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామి రెడ్డి,ఎస్సిఎఫ్ పోలీసు అధికారులు, సిబ్బంది, సచివాలయానికి చెందిన వివిధ విభాగాల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.అనంతరు చిన్నారులు,పొరుగు సేవల సిబ్బందికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ మిఠాయిలు పంపిణీ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్ర‌జ‌లు గ‌డ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేత‌లు

-మ‌నోభావాలు దెబ్బ‌తినే విధంగా పండుగ‌ల‌పైనా ప్రేలాప‌న‌లు -రూ.850 కోట్ల‌తో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *