అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉభయ సభల్లో ప్రజా సమస్యలపై అర్ధవంతమైన మరియు ఫలవంతమైన చర్చలు జరగాలని అప్పుడే ప్రజాస్వామ్య స్పూర్తికి నిలువెత్తు నిదర్శనాలైన చట్ట సభలకు మరింత గౌరవం పెరుగుతుందని రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం రాష్ట్ర శాసన సభ వద్ద జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించిన పిదన మువ్వన్నెల జాతీయ పతాకావిష్కరణ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధానిలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించు కోవడం ఆనందంగా ఉందని ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది స్వాతంత్ర్య సమర యోధులు చేసిన త్యాగాల ఫలితంగా నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్చాయుత జీవనమని గుర్తు చేశారు.కావున ఆనాటి స్వాతంత్ర్య పోరాటంలో అలుపెరుగని పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను మనం ఎల్లప్పుడూ గుర్తించు కోవాల్సిన అవసరం ఉందన్నారు.ఈ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభవేల ప్రతి పౌరుడు దేశం పట్ల ప్రతి ఒక్క పౌరుడూ బాధ్యతా యుతంగా తన కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు.
ప్రజాస్వామ్యానికి దేవాలాయాలుగా భాసిల్లే చట్టసభల్లో ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభల్లో ప్రజా సమస్యలకు సంబంధించిన అనేక అంశాలపై అర్ధవంతమైన మరియు ఫలవంతమైన చర్చ జరగాలని అప్పుడే చట్ట సభలపై మరింత గౌరవం పెరుగుతుందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు.రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అయ్యన్న పాత్రుడు ఆకాంక్షించారు.
ఈకార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర,ఉప కార్యదర్శులు పివి సుబ్బారెడ్డి,రాజ్ కుమార్,పలువురు అసెంబ్లీ అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …