కర్నూల్, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కార్యాలయ ప్రాంగణంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషన్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని కమిషన్ ఇంచార్జ్ కార్యదర్శి మరియు ముఖ్య కార్యనిర్వహణ అధికారి అయిన పి హనుమంత రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సందర్భంగా వారి సందేశాన్ని అందిస్తూ ఎందరో త్యాగదనుల కృషి ఫలితంగానే ఈ స్వాతంత్రం మనకు లభించిందని ప్రతి ఒక్కరు ఆ మహనీయుల త్యాగాలను ప్రతి నిమిషం గుర్తుంచుకొని ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషన్ విభాగాధికారులు జి. సునీత, బొగ్గరం తారక నరసింహ కుమార్, కమిషన్ ఉద్యోగులు నల్లమిల్లి శ్రీనివాసుల రెడ్డి డి ధనరాజ్ రఫీ, కమిషన్ ఇన్వెస్టిగేషన్ టీం సీఐ రామకృష్ణ ఎస్సై మధుసూదన్ మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags karnul
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …