విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగం చేయబట్టి భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని పాస్టర్ రెవ. డాక్టర్. డేవిడ్ బ్రెన్ హం అన్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ రోకళ్ళ పాలెం వద్ద ఉన్న హోలీ క్రాస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో భారత దేశ రక్షణ కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవ సోదరీ సోదరీమణులు పెద్ద ఎత్తున చేరుకొని ఉపవాస ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ డేవిడ్ బ్రెన్ హం మాట్లాడుతూ, దేశ రక్షణ కోసం ప్రాణ త్యాగాలు అర్పిస్తున్న మహనీయులను స్మరించుకున్నారు. ఎంతోమంది మహానీయులు ప్రాణ త్యాగంతో నేడు మనం సంతోషంగా దేశంలో జీవిస్తున్నామని చెప్పారు. భారతదేశపు రక్షణ కవచంగా ఉన్న సైన్యం ప్రభువు దీవెనలు ఉంటాయని చెప్పారు. దేశ నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏసుక్రీస్తు దీవెనలు మెండుగా ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు సంఘాల నాయకులు పాల్గొని ఉపవాస ప్రార్థనలు చేశారు.
Tags vijayawada
Check Also
ప్రజలు గడ్డి పెట్టినా… బుద్ధి మార్చుకోని వైసీపీ నేతలు
-మనోభావాలు దెబ్బతినే విధంగా పండుగలపైనా ప్రేలాపనలు -రూ.850 కోట్లతో రోడ్లు బాగు చేసినా… వక్రబుద్ధితో విమర్శలు -రూ. 6,700 కోట్లు …