Breaking News

ప్రభుత్వాసుపత్రిలో ఎక్సరే యూనిట్ ప్రారంభించిన… మంత్రి కందుల దుర్గేష్

-నిడదవోలు పరిసర గ్రామ ప్రాంత ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించే దిశగా..
– ఆసుపత్రి స్థాయిని పెంచి  వంద పడకల  ఆసుపత్రిగా  తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా.
-రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి  దుర్గేష్

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
నిడదవోలు పరిసర గ్రామాల పేద ప్రజల ఆరోగ్యానికి సత్వర వైద్య సేవలు అందించే దిశగా సామాజిక ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. శుక్రవారం నిడదవోలు పట్టణంలోని సామాజిక ఆసుపత్రిలో రు. 3 లక్షల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన ఎక్సరే యూనిట్ ను మంత్రి కందుల దుర్గేష్ స్థానిక నాయకులు , వైద్యులతో కలిసి ప్రారంభించారు. సందర్భముగా మంత్రి కందులు దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు చుట్టు ప్రక్కల గ్రామాల పేద ప్రజల ఆరోగ్య పరిస్థితులు దృష్ట్యా సామాజిక ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉందన్నారు. ప్రతిరోజు 200 మందికి పైగా పేషెంట్లు ఆసుపత్రికి వస్తుంటారని వైద్యులు ధ్రువీకరించడం జరిగిందన్నారు. రోగులకు సత్వర వైద్య సహాయం అందించే దిశగా ఆసుపత్రి స్థాయిని పెంచి వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. గత ప్రభుత్వ కాలంలో వంద పడకల ఆసుపత్రి చేసే దిశగా కార్యక్రమం చేపట్టిన అమలు జరగలేదన్నారు. ప్రస్తుతం. ఈ అంశంపై వైద్య ఆరోగ్య కార్యదర్శితోను, హెల్త్ మినిస్టర్ తోను మాట్లాడటం జరిగిందని స్పష్టం చేశారు. త్వరలోనే వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈరోజు ఆసుపత్రిలో రు. 3 లక్షలు విలువ గల ఎక్స్ రే మిషన్ ను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. దీనికి అనుసంధానంగా రు. 35 వేల రూపాయలు విలువచేసే ఎక్స్ రే టేబుల్ని తన సొంత ఖర్చులతో ఆసుపత్రికి అందిస్తానని మంత్రి స్పష్టం చేస్తూ హామీ ఇచ్చారు. సిఎస్ఆర్ ఫండ్స్ నిధులను సేకరించి హాస్పటల్ పూర్తిస్థాయి అభివృద్ధికి నియోజకవర్గ శాసనసభ్యునిగా, మంత్రిగా తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ వైద్యులతో కలిసి వార్డుల్లో పర్యటించి రోగులకు అందుతున్న వైద్య సహాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ వెంట హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. షేక్ ఫయాజ్, డాక్టర్లు పి వినీల్, రెహ్న, స్థానిక నాయకులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నారావారిపల్లె గ్రామపంచాయతీ అభివృద్ధికి దిశా నిర్దేశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : చంద్రగిరి మండలం నారావారిపల్లి గ్రామపంచాయతీ స్వర్ణ నారావారిపల్లె విజన్ లో భాగంగా ఆదర్శవంతంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *